- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వర్షాకాలంలో రాగి పాత్రల్లో నీళ్లు తాగుతున్నారా..అయితే ఇవి తెలుసుకోండి!
వర్షాకాలం... ప్రస్తుతం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ వర్షాకాలంలో... అనేక రకాల సీజనల్ వ్యాధులు వస్తూ ఉంటాయి.

దిశ, వెబ్ డెస్క్: వర్షాకాలం..ప్రస్తుతం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ వర్షాకాలంలో... అనేక రకాల సీజనల్ వ్యాధులు వస్తూ ఉంటాయి. జలుబు, వైరల్ ఫీవర్, ముక్కు దిబ్బడ , దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్ లాంటి సమస్యలు వర్షాకాలంలో తరచూ వస్తాయి. అయితే ఈ వర్షాకాలం నేపథ్యంలో ఖచ్చితంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. లేకపోతే ఆసుపత్రి పాలు కావడం ఖాయమని హెచ్చరిస్తున్నారు వైద్యులు.
అయితే ఈ వర్షాకాలంలో..రాగి పాత్రలు వాడితే మంచిదని చెబుతున్నారు వైద్యులు. రాగి పాత్రల్లో మంచి నీళ్లు తాగితే... అనారోగ్య సమస్యలు దూరమవుతాయని చెబుతున్నారు. ఈ రాగి నీరు సురక్షితమైన ఆయుర్వేద మూలిక తరహాలో పనిచేస్తుందని అంటున్నారు. రాగి పాత్రలో తాగితే..నీటిలో ఉన్న చెడు బ్యాక్టీరియా చనిపోతుందని చెబుతున్నారు. నీళ్లు బాగా శుభ్రంగా ఉంటాయని అంటున్నారు.
ఈ రాగి పాత్రలో నీళ్లు తాగడం వల్ల మన జీర్ణ వ్యవస్థ మెరుగు పడుతుందని చెబుతున్నారు వైద్యులు. జీర్ణ వ్యవస్థ మెరుగ్గా ఉంటే గ్యాస్ ట్రబుల్, మలబద్ధక సమస్యలు కూడా దూరమవుతాయి. ఫ్రీ మోషన్ ఉంటుందని చెబుతున్నారు. శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మనసు కూడా ఉల్లాసంగా ఉండేందుకు దోహదపడతాయట ఈ రాగి పాత్రలు. రాగి పాత్రలో మంచినీళ్లు తాగడం వల్ల మూత్రపిండాల్లో ఉన్న సమస్యలు కూడా.. దూరమవుతాయని స్పష్టం చేస్తున్నారు.
Note : పైన పేర్కొన్న సమాచారం వైద్య నిపుణుల సూచనలు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి.. ప్రయోగాలు చేయాలన్న కచ్చితంగా వైద్య నిపుణుల సూచనలు తీసుకోవాలి.






