బ్రహ్మంగారి కాలజ్ఞానం.. ఒక్క చెట్టుకు 40 రకాల పండ్లు..

by Sujitha Rachapalli |

బ్రహ్మంగారి కాలజ్ఞానం భవిష్యత్తులో జరగబోయే వింతల గురించి వివరించింది. ఇలాంటిదే ఈ ‘ట్రీ ఆఫ్ 40 ఫ్రూట్’ కూడా. ఈ హైబ్రిడ్ చెట్టుకు ఏకంగా 40 రకాల పండ్లు కాస్తాయి. సిరక్యూస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన సామ్ వాన్ ఆకెన్.. ఈ చెట్టును గ్రాఫ్టింగ్ ద్వారా సృష్టించగా..

బ్రహ్మంగారి కాలజ్ఞానం.. ఒక్క చెట్టుకు 40 రకాల పండ్లు..
X

దిశ, వెబ్ డెస్క్ : బ్రహ్మంగారి కాలజ్ఞానం భవిష్యత్తులో జరగబోయే వింతల గురించి వివరించింది. ఇలాంటిదే ఈ ‘ట్రీ ఆఫ్ 40 ఫ్రూట్’ కూడా. ఈ హైబ్రిడ్ చెట్టుకు ఏకంగా 40 రకాల పండ్లు కాస్తాయి. సిరక్యూస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన సామ్ వాన్ ఆకెన్.. ఈ చెట్టును గ్రాఫ్టింగ్ ద్వారా సృష్టించగా.. ప్రూనస్ జాతికి చెందిన నలభై రకాల స్టోన్ ఫ్రూట్స్‌ను అందిస్తుంది. పీచ్, ఆప్రికాట్, చెర్రీ, ప్లమ్స్, బాదం వంటి పండ్లను ఉత్పత్తి చేయగలదు. పలు రకాల పండ్ల శాఖలను ప్లమ్ చెట్టుకు గ్రాఫ్ట్ చేయడం ద్వారా ఇది సాధ్యం కాగా.. జూలై నుంచి అక్టోబర్ వరకు ఫ్రూట్స్‌ను అందిస్తుంది. కాగా ఆయన ఇప్పటి వరకు ఇలాంటి చెట్లను 20కి పైగా క్రియేట్ చేయగలిగాడు.

వసంత రుతువులో ఎరుపు, గులాబీ, తెలుపు రంగుల్లో వికసించే హైబ్రిడ్ ప్లాంట్‌ను చాలా కష్టపడి తయారు చేశాడు సామ్ వాన్ ఆకెన్. 2008లో న్యూయార్క్ స్టేట్ అగ్రికల్చరల్ ఎక్స్‌పరిమెంట్ స్టేషన్‌లో మూడెకరాల భూమిని లీజుకు తీసుకుని ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత సక్సెస్ అయ్యాడు. దీంతో యూఎస్‌లోని పలు మ్యూజియమ్స్, కమ్యూనిటీ గార్డెన్స్, యూనివర్సిటీల్లో ఇలాంటి చెట్లను నాటుతున్నాడు. కాగా ఒక్కో చెట్టు పరిపక్వం చెంది, పండ్లను ఇచ్చేందుకు దాదాపు ఎనిమిది నుంచి పదేళ్లు పట్టొచ్చు.

Next Story