ఎడతెరిపిలేని వర్షం.. కూలిపోయిన 18 ఇళ్లు

by  |
ఎడతెరిపిలేని వర్షం.. కూలిపోయిన 18 ఇళ్లు
X

దిశ, కల్వకుర్తి: గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కల్వకుర్తి నియోజవర్గంలోని పలు మండలాల్లో ఇండ్లు కూలిపోయాయి. అమనగల్లు మండలంలోని చింతలపల్లి ఒకటి, అమనగల్లు మున్సిపాలిటీలో 10, తలకొండపల్లిలో 6, మాడ్గులలో 1 ఇండ్లు మట్టి గోడలు కావడంతో శిథిలావస్థకు చేరి కూలిపోయాయి. కొన్ని ఇండ్లు పైకప్పులు, మరికొన్ని ఇండ్లలో ఇంటి గోడలు కూలిపోయాయి. దీంతో ఉండటానికి నివాసం లేదని , బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం ఆదుకోవాలని భాదితులు కోరుతున్నారు. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నాయకులు మాట్లాడుతూ… బాధితులకు బీజేపీ పార్టీ తరుపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వర్షాలు పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమనగల్‌లో ఇప్పటివరకూ ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కూడా నిర్మించలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఇప్పుడైనా నిరాశ్రయులయిన, కూలీ పోయిన ఇళ్ల స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలను చేపట్టి, వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.



Next Story