ఏడు గ్రహశకలాలను కనుగొన్న ఏడేళ్ల బాలిక

by  |
Brazilian-girl
X

దిశ, ఫీచర్స్ : ఖగోళశాస్త్రం అత్యంత ప్రాచీన విజ్ఞాన శాస్త్రాలలో ఒకటి కాగా.. ఆకాశంలో మనకి కనిపించే సూర్య, చంద్ర గ్రహ, నక్షత్రాదులతోపాటు విశ్వంలో ఉన్న అనేక ఖగోళ వస్తువుల ఉనికి, లక్షణాల గురించి వివరిస్తుంది. ఈ క్రమంలోనే అంతుపట్టని అంతరిక్ష రహస్యాలను తెలుసుకునేందుకు ఓ ఏడేళ్ల చిన్నారి ఉత్సాహం చూపుతోంది. ఖగోళశాస్త్రంపై అంతర్జాతీయ వేదికలపైన ఉపన్యాసాలిస్తున్న ఈ బ్రెజిల్‌ వాసి, తాజాగా ఏడు గ్రహశకలాలు గుర్తించి శభాష్ అనిపించుకుంది.

బ్రెజిల్‌కు చెందిన నికోల్ ఒలివిరా చిన్న వయసులోనే అంతరిక్ష పరిశోధకురాలిగా మారి అందరితో అభినందనలు అందుకుంటోంది. బాల్యం నుంచే అంతరిక్షంపై ఉన్న ఆసక్తితో నికోల్ ‘ఆస్టరాయిడ్ హంట్’(Asteroid Hunt) అనే సిటిజన్ సైన్స్ ప్రొగ్రామ్‌ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసింది. దీన్ని నాసా సహకారంతో ‘ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ సెర్చ్ కొల్లాబరేషన్’ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా నికోల్ 7 గ్రహశకలాల్ని గుర్తించగా, అందుకుగానూ నాసా సర్టిఫికెట్ కూడా పొందింది.

ఆస్ట్రానమి గురించి భోదించే నికోల్‌ ప్రతిభను గుర్తించిన సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్, ఖగోళ శాస్త్రం గురించి అంతర్జాతీయ సదస్సులలో ఉపన్యాసం ఇవ్వడానికి నికోల్‌ను ఆహ్వానించింది. యువ ఖగోళ శాస్త్రవేత్త తన సొంత యూట్యూబ్ ‌చానెల్‌‌లో అంతరిక్ష విశేషాలతో పాటు, ఖగోళ శాస్త్రవేత్తలు, ఔత్సాహికులతో కలిసి గ్రహశకలాలు, రోదసి రహాస్యాల గురించి వివరిస్తోంది.

Brazilian-girl2



Next Story