- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ మహనీయుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గొప్ప విషయం: బలరాం
<p>దిశ, నేరడిగొండ: నేరడిగొండ మండలం పట్పడి తండాలో జగదంబదేవి, రాంరావు మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి గ్రామస్తుల ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ.. బంజారా సమాజ గురువు తపస్వి రాంరావ్ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయమని, రాంరావ్ సమాజం కోసం చేసిన సేవలు ఈరోజు బంజారా సమాజాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టాయన్నారు. ఆయన చూపిన మార్గంలో అందరూ […]</p>

X
దిశ, నేరడిగొండ: నేరడిగొండ మండలం పట్పడి తండాలో జగదంబదేవి, రాంరావు మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి గ్రామస్తుల ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ.. బంజారా సమాజ గురువు తపస్వి రాంరావ్ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయమని, రాంరావ్ సమాజం కోసం చేసిన సేవలు ఈరోజు బంజారా సమాజాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టాయన్నారు. ఆయన చూపిన మార్గంలో అందరూ నడుచుకోవాలన్నారు. ప్రతి బంజారా గ్రామంలో స్వర్గీయ రాంరావ్ మహారాజ్ విగ్రహాలను ఏర్పాటు చేయాలని, బంజారా సమాజం ఒకే వేదికపైకి రావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గ్రామ నాయకులు,పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Next Story






