మూడు నెలల కనిష్టానికి సేవల రంగం

by  |
మూడు నెలల కనిష్టానికి సేవల రంగం
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ సెకెండ్ వేవ్ కారణంగా అనేక రాష్ట్రాల్లో విధించిన లాక్‌డౌన్‌ల వల్ల భారత్‌లోని సేవల రంగం వృద్ధి క్షీణించింది. దీంతో దేశంలోని సేవల రంగ కార్యకలాపాలు మూడు నెలల కనిష్ఠానికి మందగించినట్టు ఐహెచ్ఎస్ మార్కిట్ నెలవారీ నివేదిక వెల్లడించింది. దేశీయంగా అమలవుతున్న ఆంక్షలు సేవల రంగంపై ప్రతికూల ప్రభావం ఉండటంతో ఏప్రిల్‌లో సేవల రంగం పీఎంఐ(పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్) 54కి తగ్గిందని నివేదిక తెలిపింది. అంతకుముందు మార్చిలో ఇది 54.6గా నమోదైంది. అలాగే, గత నెల సేవల రంగం ఉద్యోగాలు సైతం క్షీణించాయని, దీంతో ఉపాధి తగ్గడం వరుసగా ఐదో నెల అని ఐహెచ్ఎస్ మార్కిట్ నివేదిక పేర్కొంది.

అదేవిధంగా ఆంక్షల కారణంగా ప్రయాణాలపై కూడా ప్రభావం పడిందని, దేశీయ సేవల రంగం ఎగుమతులు 14వ నెలలోనూ తగ్గినట్టు వెల్లడించింది. అంతేకాకుండా, సేవల రంగంలోని సంస్థల ఇన్‌పుట్ ఖర్చులు, ఆహార, ఇంధన ధరలు వరుసగా 10 నెలలు పెరగడం కూడా వృద్ధి తగ్గుదలకు కారణమని నివేదిక అభిప్రాయపడింది. ఇన్‌పుట్ ఖర్చులు డిసెంబర్ నుంచి వేగంగా పెరుగుతున్నాయని పేర్కొంది. ఈ ఏడాది కంపెనీలు అధిక ఉత్పత్తిని ఆశించాయని, మహమ్మారి వల్ల వ్యాపారాల సెంటిమెంట్ మందగించిందని ఐహెచ్ఎస్ మార్కిట్‌లోని ఎకనమిక్ అసోసియేట్ చెప్పారు.



Next Story

Most Viewed