- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిజామాబాద్ DRDAకు మోమోలు జారీ?
by Shyam |
<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్: జిల్లా రూరల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ(డీఆర్‌డీఏ) అధికారికి సెర్ప్ సీఈఓ సందీప్ కుమార్ సుల్తానియా మెమో జారీ చేసినట్లు సమాచారం. గతేడాది పెన్షన్ విభాగంలో అర్హులకు బదులు, అనర్హులకు పెన్షన్ నమోదు చేసినందుకు ఏపీఎం రాచప్పను సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. గత నాలుగు రోజుల క్రితం వచ్చిన ఉత్తర్వులు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. పెన్షన్ విభాగంలో జరిగిన తప్పిదంపై ఒక ప్రజాప్రతినిధి ఫిర్యాదుతో సెర్ప్ అధికారులు సీరియస్‌గా విచారణ జరిపారు. విచారణలో తప్పు జరిగినట్లు నిర్ధారణ […]</p>

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: జిల్లా రూరల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ(డీఆర్‌డీఏ) అధికారికి సెర్ప్ సీఈఓ సందీప్ కుమార్ సుల్తానియా మెమో జారీ చేసినట్లు సమాచారం. గతేడాది పెన్షన్ విభాగంలో అర్హులకు బదులు, అనర్హులకు పెన్షన్ నమోదు చేసినందుకు ఏపీఎం రాచప్పను సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. గత నాలుగు రోజుల క్రితం వచ్చిన ఉత్తర్వులు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. పెన్షన్ విభాగంలో జరిగిన తప్పిదంపై ఒక ప్రజాప్రతినిధి ఫిర్యాదుతో సెర్ప్ అధికారులు సీరియస్‌గా విచారణ జరిపారు. విచారణలో తప్పు జరిగినట్లు నిర్ధారణ కావడంతో వేటు తప్పనిసరి అయినట్లు సమాచారం. కాగా, డీఆర్‌డీఏలోని పెన్షన్ విభాగంలో తప్పిదాలు సర్వసాధారణమని, వాటిని సరిదిద్దుతారని ఉద్యోగులే చెబుతుండటం గమనార్హం.
Next Story






