- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షాకింగ్.. మద్యం మత్తులో ట్రాఫిక్ పోలీసునే ఢీ కొట్టాడు
<p>దిశ, శంషాబాద్: మద్యం మత్తులో కారు నడిపి డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ఢీ కొట్టాడు ఓ వ్యక్తి. ఈ సంఘటన శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మంగళవారం జరిగింది. ఆర్జీఐఏ ఇన్‌స్పెక్టర్ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హైదరాబాద్ రానుండడంతో ఎయిర్‌పోర్టు ఆవరణలో రిహార్సల్స్ చేపట్టారు. ఈ క్రమంలోనే శంషాబాద్ విమానాశ్రయంలోని రోటరీ 2 వద్ద రోడ్డు పక్కనే ట్రాఫిక్ హోం గార్డ్ అశోక్ విధులు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో […]</p>

దిశ, శంషాబాద్: మద్యం మత్తులో కారు నడిపి డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ఢీ కొట్టాడు ఓ వ్యక్తి. ఈ సంఘటన శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మంగళవారం జరిగింది. ఆర్జీఐఏ ఇన్‌స్పెక్టర్ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హైదరాబాద్ రానుండడంతో ఎయిర్‌పోర్టు ఆవరణలో రిహార్సల్స్ చేపట్టారు. ఈ క్రమంలోనే శంషాబాద్ విమానాశ్రయంలోని రోటరీ 2 వద్ద రోడ్డు పక్కనే ట్రాఫిక్ హోం గార్డ్ అశోక్ విధులు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో ఓ ఇన్నోవా కారులో వచ్చిన డ్రైవర్ తాజుద్దిన్ కానిస్టేబుల్‌ని ఢీ కొట్టాడు. ఈ ప్రమాద సమయంలో డ్రైవర్ అతివేగం, ఫోన్ మాట్లాడుతూ ఉన్నట్టు గుర్తించామన్నారు. దీనికి తోడు మద్యం మత్తులో ఉన్నట్టు బ్రీతింగ్ ఎనలైజర్ టెస్టులో తేలిందన్నారు. ప్రస్తుతం కానిస్టేబుల్‌ను హైదరాబాద్‌లోని అపొలో ఆస్పత్రికి తరలించామని.. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టామని వివరణ ఇచ్చారు.






