ప్రభుత్వ స్థలంలో కట్టిన నిర్మాణాల కూల్చివేత

by Shyam |   (  Updated:2021-12-07 06:03:36  IST  )

<p>దిశ, శేరిలింగంపల్లి : ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. మండల పరిధిలో కబ్జాలకు గురవుతున్న స్థలాలను పరిరక్షించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే మాదాపూర్, మియాపూర్‌లలో ఆక్రమణలను తొలగిస్తున్న రెవెన్యూ అధికారులు మంగళవారం చందానగర్ డివిజన్ పరిధిలోని సర్వే నెంబర్ 174 లో అక్రమంగా నిర్మించిన మూడు రూములను జేసీబీ సహాయంతో కూల్చివేశారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు సాగిస్తే ఉపేక్షించబోమని,  తిరిగి కబ్జాలకు పాల్పడ్డా చట్టరీత్యా చర్యలు [&hellip;]</p>

Sherilingampally Revenue officials
X

దిశ, శేరిలింగంపల్లి : ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. మండల పరిధిలో కబ్జాలకు గురవుతున్న స్థలాలను పరిరక్షించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే మాదాపూర్, మియాపూర్‌లలో ఆక్రమణలను తొలగిస్తున్న రెవెన్యూ అధికారులు మంగళవారం చందానగర్ డివిజన్ పరిధిలోని సర్వే నెంబర్ 174 లో అక్రమంగా నిర్మించిన మూడు రూములను జేసీబీ సహాయంతో కూల్చివేశారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు సాగిస్తే ఉపేక్షించబోమని, తిరిగి కబ్జాలకు పాల్పడ్డా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Next Story