బైంసా మండలం లో సీరియల్ షూటింగ్..

by Aamani |   ( Updated:2021-10-12 11:01:18.0  )
బైంసా మండలం లో సీరియల్ షూటింగ్..
X

దిశ, ముధోల్: నిర్మల్ జిల్లా భైంసా మండలం లోని ఎగ్గమ్ గోదాంలో మంగళవారం సీరియల్ షూటింగ్ జరిగింది. వివరాల్లోకి వెళితే ఈటీవీ లో ప్రసారమయ్యే మనసు మమత సీరియల్ ఇటీవల క్లోజింగ్ కాగా దాని స్థానంలో రంగులరాట్నం అనే సీరియల్ ప్రారంభం కావడంతో ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో సీరియల్ షూటింగ్ చేయడానికి అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకునే భాగంలో భైంసా మండలం లోని ఎగ్గమ్ గ్రామంలోని ఎన్. సి.ఎం.ఎల్ గోదాం ను ఎంపిక చేసుకున్నారు. ఏ విధమైన డిస్టబెన్స్ లేని అనువైన ప్రదేశం కోసం ఇక్కడి ప్రదేశం ఎంపిక చేసుకున్నట్లు వినికిడి. సీరియల్ లో భాగంగా నటించే నటులు జాకీ ,ఛత్రపతి ఫిల్మ్ ఫేమ్ శేఖర్ ఇంకా పలువురు ఇక్కడి గోదాంలో షూటింగ్ లో పాల్గొని హల్ చల్ చేసారు.

Advertisement

Next Story