జకోవిచ్‌పై హనీట్రాప్.. పరువు తీసేందుకు కుట్ర

by  |
జకోవిచ్‌పై హనీట్రాప్.. పరువు తీసేందుకు కుట్ర
X

దిశ, స్పోర్ట్స్: వరల్డ్ నెంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ నోవాక్ జకోవిచ్‌పై భారీ కుట్ర జరిగిందా? అతడి పరువు తీసేందుకు కొంత మంది తీవ్రంగా ప్రయత్నించారా? అంటే సెర్బియా మోడల్ నటాలియా స్కెకిక్ ఔననే అంటున్నది. తనను పావుగా వాడుకొని జకోవిచ్ పరువు తీసేందుకు భారీ కుట్ర జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేసింది. జకోవిచ్‌తో ఏకాంతంగా గడిపి, శృంగారం చేస్తూ వీడియోలు తీస్తే అందుకు 60 వేల యూరోలు బహుమతిగా ఇవ్వడంతో పాటు.. కోరుకున్న చోటుకు హాలీడే ట్రిప్ వెళ్లేందకు అవకాశం ఇస్తామని తనకు ఆఫర్ చేశారని నటాలియా వెల్లడించింది. సెర్బియాకు చెందిన ప్రముఖ మోడల్ నటాలీని లండన్‌కు చెందిన ఒక వ్యక్తి సంప్రదించాడు.

ఏదైనా బిజినెస్ వ్యవహారం అనుకొని నటాలీ అతడికి అపాయింట్‌మెంట్ ఇచ్చింది. అయితే నటాలీని సంప్రదించిన వ్యక్తి.. సెర్బియాకు చెందిన జకోవిచ్‌ పరువు తీసేలా పర్సనల్ వీడియోలు తీయాలని.. వ్యక్తిగతంగానే కాకుండా ప్రొఫెషనల్‌గా అతడు పరువు పోగొట్టుకోవాలని సదరు వ్యక్తి కోరాడు. అయితే సెర్బియా బ్రాండ్ అంబాసిడర్ అయిన జకోవిచ్‌పై ఇలాంటి హనీట్రాప్‌లు తాను చేయనని.. ఒక్క జకోవిచ్ మాత్రమే కాదు.. ఏ వ్యక్తి విషయంలో అయినా హనీట్రాప్ చేయనని ఆమె తెగేసి చెప్పింది. ఇటీవల ఒక పాపులర్ మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన నటాలీ ఈ విషయాలన్నీ బయటకు వెల్లడించింది. దీంతో నటాలీని సంప్రదించిన వ్యక్తి ఎవరు? జకోవిచ్ పరువు తీయాలని ఎవరు భావించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.


Next Story

Most Viewed