నష్టాల నుంచి లాభాలను చేరిన స్టాక్ మార్కెట్లు

by  |
నష్టాల నుంచి లాభాలను చేరిన స్టాక్ మార్కెట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు అధిక లాభాలను సాధించాయి. సోమవారం ఉదయం ప్రారంభ సమయంలో అధిక నష్టాలను నమోదు చేసిన సూచీలు అనంతరం భారీగా పుంజుకున్నాయి. ఇంట్రాడే కనిష్టాల నుంచి బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 889 పాయింట్లు ర్యాలీ చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల కారణంగా మొదట్లో నష్టపోయిన స్టాక్ మార్కెట్లు అనంతరం దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఫైనాన్స్ రంగాల్లో కొనుగోళ్లకు డిమాండ్ పెరగడంతో మిడ్-సెషన్ తర్వాత పుంజుకున్నాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 230.01 పాయింట్లు లాభపడి 52,574 వద్ద ముగియగా, నిఫ్టీ 63.15 పాయింట్ల లాభంతో 15,746 వద్ద ముగిసింది.

నిఫ్టీలో పీఎస్‌యూ బ్యాంకింగ్ ఇండెక్స్ అత్యధికంగా 4 శాతం పుంజుకోగా, రియల్టీ బలపడింది. ఆటో, ఐటీ రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎన్‌టీపీసీ, టైటాన్, ఎస్‌బీఐ, హిందూస్తాన్ యూనిలీవర్, ఆల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు అధిక లాభాలను సాధించగా, మారుతీ సుజుకి, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఎంఅండ్ఎం, ఎల్అండ్‌టీ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.14 వద్ద ఉంది.


Next Story

Most Viewed