లాభాలు సాధించిన స్టాక్ మార్కెట్లు

by  |
stock-Market
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ప్రధానంగా ఐటీ షేర్ల అండతో ఉదయం నుంచే సూచీలకు కొనుగోళ్ల మద్ధతు లభించింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలకు తోడు ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా లాంటి దిగ్గజ ఐటీ స్టాక్స్ మెరుగైన లాభాలతో ర్యాలీ చేయడంతో స్టాక్ మార్కెట్లకు కలిసొచ్చింది. అయితే, దేశీయ దిగ్గజ ప్రైవేట్ సంస్థ రిలయన్స్ ఏజీఎం సమావేశంపై మదుపర్లు పెద్దగా సంతృప్తి చెందలేదు. మిడ్-సెషన్ మొత్తం ఆర్ఐఎల్ ఏజీఎంపై దృష్టి సారించిన ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో రిలయన్స్ షేర్లు 2.35 శాతం క్షీణించాయి.

మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 392.92 పాయింట్లు ఎగసి 52,699 వద్ద ముగియగా, నిఫ్టీ 103.50 పాయింట్ల లాభంతో 15,790 వద్ద ముగిసింది. నిఫ్టీలో బ్యాంకింగ్ ఇండెక్స్ పుంజుకోగా, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్, ఫార్మా నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్, ఏషియన్ పెయింట్, ఎల్అండ్‌టీ, నెస్లె ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మారుతీ సుజుకి, ఎంఅండ్ఎం, టాటా స్టీల్ షెర్లు లాభాలను సాధించాయి. రిలయన్స్, భారతీ ఎయిర్‌టెల్, పవర్‌గ్రిడ్, ఎస్‌బీఐ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.14 వద్ద ఉంది.


Next Story

Most Viewed