మళ్లీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

by  |
మళ్లీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి నష్టాలను నమోదు చేశాయి. గత రెండు సెషన్లలో వరుస లాభాలతో పుంజుకుంటున్న సంకేతాలు ఇచ్చినప్పటికీ బుధవారం నాటి ట్రేడింగ్‌లో కీలక రంగాల్లో అమ్మకాలు పెరగడంతో సూచీలు దిగజారాయి. మిడ్-సెషన్ వరకు సానుకూలంగా కదలాడిన తర్వాత స్టాక్ మార్కెట్లు ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల కారణంగా పతనమయ్యాయి. ముఖ్యంగా మెటల్, బ్యాంకింగ్, ఎనర్జీ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి అత్యధికంగా ఉండటం, ఆటో దిగ్గజం మారుతీ సుజుకి త్రైమాసిక ఫలితాలు భారీగా క్షీణించడం, గ్లోబల్ మార్కెట్ల నుంచి మద్దతు లేకపోవడం లాంటి పరిణామాలు మార్కెట్ల పతనానికి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 206.93 పాయింట్లు పతనమై 61,143 వద్ద, నిఫ్టీ 57.45 పాయింట్లు నష్టపోయి 18,210 వద్ద ముగిసింది. నిఫ్టీలో మీడియా అత్యధికంగా 2.4 శాతం దిగజారగా, మెటల్, ప్రైవేట్ బ్యాంక్, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలు కుదేలయ్యాయి. పీఎస్‌యూ బ్యాంక్, ఐటీ, హెల్త్‌కేర్, ఫార్మా రంగాలు పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఏషియన్ పెయింట్, సన్‌ఫార్మా, ఇన్ఫోసిస్, ఎస్‌బీఐ, ఆల్ట్రా సిమెంట్ షేర్లు లాభాలను దక్కించుకోగా, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, హిందూస్తాన్ యూనిలీవర్, టాటా స్టీల్, ఎన్‌టీపీసీ, కోటక్ బ్యాంక్, నెస్లె ఇండియా, రిలయన్స్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 75.04 వద్ద ఉంది.


Next Story

Most Viewed