ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు!

by  |
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: కొనసాగుతున్న దేశీయ ఈక్విటీ మార్కెట్ల జోరు నెమ్మదించింది. బుధవారం రోజంతా ఆటుపోట్ల మధ్య కొనసాగిన సూచీలు చివరికి ఫ్లాట్‌గా ముగిశాయి. గత మూడు సెషన్‌లుగా రికార్డులను నమోదు చేసిన స్టాక్ మార్కెట్లు బుధవారం ఫైనాన్స్, ఫార్మా రంగాల్లో అమ్మకాల ఒత్తిడి నేపథ్యంలో డీలాపడ్డాయి. ఉదయం నుంచి లాభాల్లోనే ఉన్న దేశీయ మార్కెట్లు మిడ్‌సెషన్ తర్వాత అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఒక దశలో సెన్సెక్స్, నిఫ్టీ రెండూ నష్టాల్లోనే జారినప్పటికీ, అనంతరం నిఫ్టీ కొంతమేర కోలుకుంది.

మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 24.79 పాయింట్లు నష్టపోయి 49,492 వద్ద ముగియగా, నిఫ్టీ 1.40 పాయింట్లు లాభపడి 14,564 వద్ద ముగిసింది. నిఫ్టీలో ప్రధానంగా ఫైనాన్స్, ఫార్మా అధికంగా డీలాపడగా, బ్యాంకింగ్, ఆటో, ఎఫ్ఎంసీజీ, ఐటీ రంగాలు పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎంఅండ్ఎం, ఎస్‌బీఐ షేర్లు అత్యధిక లాభాలను దక్కించుకోగా, ఐటీసీ, ఎన్‌టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్‌జీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభడ్డాయి. బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఫిన్‌సర్వ్, టైటాన్, సన్‌ఫార్మా, డా రెడ్డీస్, ఏషియన్ పెయింట్, కోటక్ బ్యాంక్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.19 వద్ద ఉంది.



Next Story

Most Viewed