- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెల్లమెల్లగా రికవరీ..!
<p>దిశ, సెంట్రల్ డెస్క్: అమెరికా ఫెడ్ ప్రభావంతో గురువారం భారీగా నష్టాలను చూసిన మార్కెట్లు శుక్రవారం పుంజుకున్నాయి. ఉదయం సుమారు 1100 పాయింట్లకు పైగా నష్టపోయిన సూచీలు మధ్యాహ్నం లంచ్ సమయం తర్వాత రికవరీని అందుకున్నాయి. వారాంతం లాభాలను నమోదు చేయడంతో మదుపర్లలో ఉత్సాహం పెరిగిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఆటో, బ్యాంకింగ్ రంగాలు లాభాలను చూడగా, మిగిలిన రంగాల్లో సైతం కొనుగోళ్లు మార్కెట్లకు కలిసొచ్చాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 242.52 పాయింట్ల లాభంతో […]</p>

దిశ, సెంట్రల్ డెస్క్: అమెరికా ఫెడ్ ప్రభావంతో గురువారం భారీగా నష్టాలను చూసిన మార్కెట్లు శుక్రవారం పుంజుకున్నాయి. ఉదయం సుమారు 1100 పాయింట్లకు పైగా నష్టపోయిన సూచీలు మధ్యాహ్నం లంచ్ సమయం తర్వాత రికవరీని అందుకున్నాయి. వారాంతం లాభాలను నమోదు చేయడంతో మదుపర్లలో ఉత్సాహం పెరిగిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఆటో, బ్యాంకింగ్ రంగాలు లాభాలను చూడగా, మిగిలిన రంగాల్లో సైతం కొనుగోళ్లు మార్కెట్లకు కలిసొచ్చాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 242.52 పాయింట్ల లాభంతో 33,780 వద్ద ముగియగా, నిఫ్టీ 70.90 పాయింట్లు లాభపడి 9,972 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎంఅండ్ఎం, బజాజ్ ఫైనాన్స్, హీరో మోటోకార్ప్, రిలయన్స్, టైటాన్, బజాజ్ ఆటో, మారుతీ సుజుకి షేర్లు లాభాల్లో ట్రేడవ్వగా, ఓఎన్‌జీసీ, టెక్ మహీంద్రా, పవర్‌గ్రిడ్, ఇన్ఫోసిస్, కోటక్ బ్యాంక్, టీసీఎస్ షేర్లు నష్టాలను చూశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 75.84గా ఉంది.






