బ్యాంకింగ్ మద్దతుతో లాభాల్లో ముగిసిన మార్కెట్లు

9

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా 10వ రోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ నాలుగు నెలల వ్యవధిలో దేశ ఆర్థిక వృద్ధి అంచనాలను రెండోసారి కుదించిన నేపథ్యంలో మార్కెట్లు ఆటుపొట్లకు గురైనప్పటికీ చివరి గంటలో లాభాలను నమోదు చేశాయి.

అంతేకాకుండా బ్యాంకింగ్ షేర్ల మద్దతు కారణంగా కూడా ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడయ్యాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 169.23 పాయింట్లు లాభపడి 40,794 వద్ద ముగియగా, నిఫ్టీ 36.55 పాయింట్ల లాభంతో 11,971 వద్ద ముగిసింది. ఆర్థిక ఫలితాలు నిరాశజకంగా ఉండటంతో ఇన్ఫోసిస్ షేర్ల్య్ అత్యధికంగా 7 శాతం నష్టపోయాయి.

సెన్సెక్స్ ఇండెక్స్‌లో బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్‌బీఐ, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, టాటాస్టీల్, ఎల్అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఆల్ట్రా సిమెంట్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభాల్లో ట్రేడవ్వగా, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, పవర్‌గ్రిడ్, టెక్‌మహీంద్రా, ఐటీసీ, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.31 వద్ద ఉంది.