కాంగ్రెస్ పార్టీ సింహాన్ని ప్రకటించింది : రామ్ గోపాల్ వర్మ

by  |
RGV,-Revanth-Reddy
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి నియమితుల‌య్యారు. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా అజారుద్దీన్‌, గీతారెడ్డి, ఎం.అంజన్‌కుమార్‌ యాదవ్‌, టి.జగ్గారెడ్డి, బి.మహేశ్‌కుమార్‌ గౌడ్‌లను కాంగ్రెస్ అధిష్ఠానం ఫైన‌ల్ చేసింది. దీనిపై సెన్సేషనల్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ స్పందించారు. ‘‘చివరగా కాంగ్రెస్ పార్టీ లయన్ రేవంత్ రెడ్డిని ప్రెసిడెంట్‌గా మార్చడం ఫెంటాస్టిక్ నిర్ణయం. ఇప్పుడు ఈ లయన్ అన్ని టైగర్స్‌ను భయటపెట్టగలదు.’’ అని ట్వీట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేగాకుండా.. ‘‘లయన్‌ను కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్‌గా నియమించడంతో పార్టీపై ఆసక్తి పెరిగింది.’’ మరో ట్వీట్ చేశారు.



Next Story

Most Viewed