- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘అల వైకుంఠపురంలో’.. కో డైరెక్టర్ సత్యం కన్నుమూత
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చిత్ర పరిశ్రమలో విషాద ఘటన చోటుచేసుకుంది. అనారోగ్య కారణంతో సీనియర్ కో డైరెక్టర్ సత్యం కన్నుమూశారు. కాగా, ఆయన సినీ జీవితంలో రాజమౌళి, త్రివిక్రమ్, కృష్ణ వంశీ వంటి స్టార్ దర్శకుల వద్ద కో డైరెక్టర్‌గా పనిచేశారు. సై సినిమాకు చీఫ్ కో డైరెక్టర్‌గా, శ్రీరామదాసు, చందమామ సినిమాలకు కో డైరెక్టర్‌గా వర్క్ చేశాడు. అంతేగాకుండా.. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన భారీ బడ్జెట్ మూవీ మగధీర, మర్యాద రామన్న సినిమాలకు అసిస్టెంట్ […]</p>

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చిత్ర పరిశ్రమలో విషాద ఘటన చోటుచేసుకుంది. అనారోగ్య కారణంతో సీనియర్ కో డైరెక్టర్ సత్యం కన్నుమూశారు. కాగా, ఆయన సినీ జీవితంలో రాజమౌళి, త్రివిక్రమ్, కృష్ణ వంశీ వంటి స్టార్ దర్శకుల వద్ద కో డైరెక్టర్‌గా పనిచేశారు. సై సినిమాకు చీఫ్ కో డైరెక్టర్‌గా, శ్రీరామదాసు, చందమామ సినిమాలకు కో డైరెక్టర్‌గా వర్క్ చేశాడు. అంతేగాకుండా.. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన భారీ బడ్జెట్ మూవీ మగధీర, మర్యాద రామన్న సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కో డైరెక్టర్‌గా కూడా వ్యవహరించాడు. గతేడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అల వైకుంఠపురంలో’ సినిమాకు కూడా కో డైరెక్టర్‌గా సత్యం వర్క్ చేసి ఇండస్ట్రీ హిట్ దక్కించుకున్నాడు. సత్యం మృతి ఇండస్ట్రీ వర్గాల్లో విషాదం నింపింది. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ ప్రార్థించారు.






