ర్యాగింగ్ ఒక అనాగరిక చర్య :సివిల్ జడ్జి

by  |
ర్యాగింగ్ ఒక అనాగరిక చర్య :సివిల్ జడ్జి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ర్యాగింగ్ ఒక అనాగరి చర్య అని, విద్యార్థి సమాజంలో ఒక చెడు సంప్రదాయమని సీనియర్ సివిల్ జడ్జి మురళీ మోహన్ అన్నారు. ర్యాగింగ్‌తో కలిగే అనర్ధాలు, విద్యార్థుల జీవితాలపై వేసే ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని కఠిన చట్టమే వచ్చిందని గుర్తుచేశారు. నగరంలోని వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్సులో మురళీ మోహన్ ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ర్యాగింగ్ నిరోధక చట్టం గురించి విద్యార్థుల్లో విస్తృతమైన అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందన్నారు. కళాశాలల యాజమాన్యాలు సైతం యాంటీ-ర్యాగింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని కోరారు. ర్యాగింగ్ బారిన పడిన విద్యార్థులు ఈ కమిటీ దృష్టికి అలాంటి సంఘటనలను తీసుకెళ్లాలని మురళీ మోహన్ సూచించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు దేశంలోని విద్యా సంస్థల్లో ర్యాగింగ్ నిషేధిత చర్య అని గుర్తుచేశారు. కళాశాలల యాజమాన్యాలు సైతం ర్యాగింగ్ నిరోధక చట్టం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రమణ, బోధనా సిబ్బంది రామదేవుడు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed