- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెన్షన్ల కోసం వృద్దులు వెతలు..
<p>దిశ,మేడ్చల్ టౌన్: గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కండ్లకోయ గ్రామంలో పురపాలక సంఘం కార్యాలయం ముందు వృద్ధులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆసరా పింఛన్లు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య ఖర్చుల నిమిత్తం డబ్బుల్లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి వారంలో రావాల్సిన ఆసరా పింఛన్లు 20 తారీకు వస్తున్నాయని ఈ సారి ఇంత వరకు కూడా పెన్షన్ల రాలేదని వాపోతున్నారు. పెన్షన్ డబ్బులు మీద […]</p>

దిశ,మేడ్చల్ టౌన్: గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కండ్లకోయ గ్రామంలో పురపాలక సంఘం కార్యాలయం ముందు వృద్ధులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆసరా పింఛన్లు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య ఖర్చుల నిమిత్తం డబ్బుల్లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి వారంలో రావాల్సిన ఆసరా పింఛన్లు 20 తారీకు వస్తున్నాయని ఈ సారి ఇంత వరకు కూడా పెన్షన్ల రాలేదని వాపోతున్నారు. పెన్షన్ డబ్బులు మీద ఆధారపడి బ్రతుకుతున్నామని ఇపుడు ఎలా బ్రతకాలి అని వారు ప్రశ్నిస్తున్నారు.
వృద్ధుల ఆందోళనకు మద్దతిచ్చిన బీజేపీ..
పుల్లయ్య పురపాలక కార్యాలయం ముందు వృద్ధులు పింఛన్ కోసం చేస్తున్న ఆందోళనకు బీజేపీ వార్డ్ కౌన్సిలర్ హంసా రాణి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వృద్ధులకు పెన్షన్లు అందక తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల పదోవ తేదీ వరకు అయిన పెన్షన్లు ఇవ్వాలని డిమాండి చేసింది.






