మార్కెట్ల ర్యాలీని సద్వినియోగం చేసుకోవాలి : రఘురామ్ రాజన్!

50

దిశ, వెబ్‌డెస్క్: మరో రెండు వారాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి తన మూడో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ భారత ఈక్విటీ మార్కెట్ల ర్యాలీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆర్థికవ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు, ఖర్చులకు ప్రాధాన్యత కల్పిస్తూ ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను విక్రయించాలని తెలిపారు. 2021-22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ పేద కుటుంబాలకు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఉపశమనం కల్పించడంపై దృష్టి పెట్టాలని ఆయన స్పష్టం చేశారు.

‘ఖర్చులకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం. ఎందుకంటే, పేదలకు ఉపశమనం, చిన్న వ్యాపారాలకు అవసరమైన వాటిపై ప్రభుత్వం దృష్టి పెట్టేందుకు ఈ నిర్ణయం సహాయపడుతుంది. మౌలిక సదుపాయాల కోసం ఖర్చులను పెంచక తప్పదు. ఆర్థికవ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు ఇదే అత్యుత్తమమైన మార్గమని’ రఘురామ్ రాజ్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ రంగ విభాగా(పీఎస్‌యూ)ల్లో వాటాను విక్రయించడం ద్వారా ఖర్చులకు అవసరమైన వనరులను సమకూర్చుకోవచ్చని, లోటును తగ్గించే అధిక భాగం ఆదాయం, వ్యయాలను ఆస్తుల అమ్మకం ద్వారా తీర్చుకోవచ్చని రాజన్ తెలిపారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..