మీకు కబడ్డీ ఆడాలనుందా..? అయితే, ఈ నెంబర్లకు ఫోన్ చేయండి

89
kabaddi-1

దిశ, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం చాగల్లు ఉన్నత పాఠశాలలో జూనియర్ కబడ్డీ (బాల, బాలికల) క్రీడాకారుల ఎంపిక నిర్వహించనున్నట్లు కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పోగుల సారంగపాణి, మండల ప్రధాన కార్యదర్శి అన్నెపు కుమార్, కోశాధికారి సుధాకర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండల స్థాయి కబడ్డీ క్రీడాకారుల ఎంపిక పోటీల్లో పాల్గొనేందుకు విద్యార్థులు 9963863436, 9010255898 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని వారు తెలిపారు.