- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీగా గంజాయి ప్యాకెట్లు స్వాధీనం..! కానీ..
<p>దిశ, నల్లబెల్లి : నల్లబెల్లి మండలంలో పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే.. యువత జీవితాల్ని చిన్నాభిన్నం చేస్తున్న గంజాయి అక్రమంగా రాష్ట్రాలు దాటుతూ యథేచ్ఛగా చేరాల్సిన చోటుకి చేరిపోతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం నుండి వరంగల్ జిల్లాలోకి అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేసినట్లు తెలుస్తోంది. ఒక కారు, ఆటోలో పెద్ద సంఖ్యలో గంజాయి ప్యాకెట్లను తరలిస్తూ ముగ్గురు వ్యక్తులు పోలీసులకు […]</p>

దిశ, నల్లబెల్లి : నల్లబెల్లి మండలంలో పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే.. యువత జీవితాల్ని చిన్నాభిన్నం చేస్తున్న గంజాయి అక్రమంగా రాష్ట్రాలు దాటుతూ యథేచ్ఛగా చేరాల్సిన చోటుకి చేరిపోతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం నుండి వరంగల్ జిల్లాలోకి అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేసినట్లు తెలుస్తోంది. ఒక కారు, ఆటోలో పెద్ద సంఖ్యలో గంజాయి ప్యాకెట్లను తరలిస్తూ ముగ్గురు వ్యక్తులు పోలీసులకు పట్టుబడినట్లు సమాచారం.
మల్లంపల్లి నుండి నర్సంపేట వెళ్లే జాతీయ రహదారి 365 పై సరిగ్గా రాంతీర్ధం గ్రామం దగ్గరలో మంగళవారం మధ్యాహ్నం పోలీసులకు పట్టుబడినట్లు తెలుస్తోంది. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లుగా చర్చ జరుగుతోంది. ఈ గంజాయి ప్యాకెట్ల విలువ లక్షల్లో ఉండే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా… ఈ గంజాయి ప్యాకెట్ల పట్టివేత ఘటనను పోలీసులు ధృవీకరించాల్సి ఉంది. గంజాయి పట్టుబడి, నిందితుల వివరాలకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.






