- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీఎత్తున గంజాయి స్వాధీనం.. ఐదుగురు వ్యక్తులు అరెస్టు
<p>దిశ, భద్రాచలం : భద్రాచలం వద్ద ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీసులు రూ. 16.20 లక్షల విలువైన 162 కేజీల గంజాయి పట్టుకొని ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. భద్రాచలం ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఉమ్మడి ఖమ్మం జిల్లా డిప్యూటీ కమీషనర్ జి. అంజన్‌రావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సూపరింటెండెంట్ సి.నర్సింహారెడ్డి ఆదేశాల మేరకు విశ్వసనీయ సమాచారం అందినది. దీంతో గురువారం తెల్లవారుజామున సుమారు 2.30 గంటలకు […]</p>

దిశ, భద్రాచలం : భద్రాచలం వద్ద ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీసులు రూ. 16.20 లక్షల విలువైన 162 కేజీల గంజాయి పట్టుకొని ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. భద్రాచలం ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఉమ్మడి ఖమ్మం జిల్లా డిప్యూటీ కమీషనర్ జి. అంజన్‌రావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సూపరింటెండెంట్ సి.నర్సింహారెడ్డి ఆదేశాల మేరకు విశ్వసనీయ సమాచారం అందినది.
దీంతో గురువారం తెల్లవారుజామున సుమారు 2.30 గంటలకు భద్రాచలం ప్రధాన మార్గంలో సీఆర్‌పీఎఫ్ క్యాంపు సమీపంలో తనిఖీలు చేస్తుండగా అటుగా వచ్చిన ఐదుగురు వ్యక్తులపై అనుమానంతో వారిని సోదాచేసి వారి వద్ద నుంచి 162 కేజీల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అట్టి గంజాయిని సీలేరు నుంచి ఔరంగబాద్‌కి తరలిస్తున్నట్లు వారు అంగీకరించడంతో లకాన్ రాజు పవార్, దయనేశ్వర్ విక్రమ్ పవార్, సుభాష్ సాము మోహితే, విమల్ సుభాష్ మోహితే, లలిత కైలాస్ పవార్‌లను అదుపులోకి తీసుకొని అరెస్టు చేసినట్లు తెలిపారు.






