- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వేట మొదలెట్టిన మ్యాచో మ్యాన్.. ట్రెండింగ్‌లో ‘సీటీమార్’
<p>దిశ, సినిమా: మ్యాచో మ్యాన్ గోపీచంద్, మిల్కీ బ్యూటీ తమన్నా, భూమికా చావ్లా ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సీటీమార్’. సంపత్ నంది డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ మూవీ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటూ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. యాక్షన్ చెప్పగానే ‘కబడ్డీ.. కబడ్డీ’ అంటూ స్టార్ట్ అయిన టీజర్.. హై వోల్టేజ్ యాక్షన్‌తో సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది. ‘కబడ్డీ మైదానంలో ఆడితే ఆట.. బయట ఆడితే వేట’ అన్న గోపీచంద్ డైలాగ్‌కు సూపర్ రెస్పాన్స్ […]</p>

దిశ, సినిమా: మ్యాచో మ్యాన్ గోపీచంద్, మిల్కీ బ్యూటీ తమన్నా, భూమికా చావ్లా ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సీటీమార్’. సంపత్ నంది డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ మూవీ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటూ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. యాక్షన్ చెప్పగానే ‘కబడ్డీ.. కబడ్డీ’ అంటూ స్టార్ట్ అయిన టీజర్.. హై వోల్టేజ్ యాక్షన్‌తో సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది. ‘కబడ్డీ మైదానంలో ఆడితే ఆట.. బయట ఆడితే వేట’ అన్న గోపీచంద్ డైలాగ్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తుండగా.. టీజర్‌ను చూస్తుంటే స్పోర్ట్స్ డ్రామాలో పాలిటిక్స్ మిక్స్ అయినట్లుగా అర్థమవుతోంది. ఎప్పటిలాగే పవర్‌ప్యాక్డ్ పర్‌ఫార్మెన్స్‌తో గోపీచంద్ అదరగొట్టేయగా.. మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ కానుంది. మరో హీరోయిన్ దిగంగనా సూర్యవంశీ కూడా కీలక పాత్రలో కనిపించబోతుండగా.. అప్సర రాణి ఐటెం సాంగ్ చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుందని చెప్తున్నారు మేకర్స్. కాగా ఏప్రిల్ 2న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మించారు.






