గోపీచంద్ ‘సీటీమార్’ రిలీజ్ డేట్ లాక్‌డ్

by  |
గోపీచంద్ ‘సీటీమార్’ రిలీజ్ డేట్ లాక్‌డ్
X

దిశ, వెబ్‌డెస్క్: మ్యాచో మ్యాన్ గోపీచంద్, డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్‌లో వస్తున్న స్పోర్ట్స్ డ్రామా ‘సీటీమార్’. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న సినిమాలో మిల్కీ బ్యూటి తమన్నా తెలంగాణ ఫిమేల్ కబడ్డీ కోచ్‌గా కనిపించబోతుండగా… గోపీచంద్ ఆంధ్ర కబడ్డీ టీమ్ కోచ్‌గా నటిస్తున్నారు. భూమిక కీలకపాత్రలో కనిపిస్తున్న సినిమాను శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ నిర్మిస్తుండగా.. ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా గోపీచంద్ మాస్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్న సినిమాలో ప్రతి సీన్ హార్ట్ టచింగ్‌గా ఉంటుందని తెలిపారు నిర్మాత శ్రీనివాస చిట్టూరి. గోపీచంద్ కెరీర్‌లోనే హై బడ్జెట్ మూవీగా వస్తున్న ‘సీటీమార్‌’కు మణిశర్మ అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చారని తెలిపారు. టాకీ పార్ట్ పూర్తి కాగా, రెండ్ సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నట్లు వెల్లడించారు.

https://twitter.com/SS_Screens/status/1354671815570821126?s=20

Next Story

Most Viewed