- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోర ప్రమాదం.. సెక్యూరిటీ గార్డు దుర్మరణం
<p>దిశ, బేగంపేట: ఆర్టీసీ బస్సు ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి చెందిన ఘటన బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. బేగంపేట సీఐ శ్రీనివాసులు వివరాల ప్రకారం.. రసూల్‌పుర కృష్ణ నగర్ ప్రాంతానికి నర్సింగరావు(40) స్థానిక హెచ్ఎంటీ కంపెనీలో సెక్యూరిటీగా పనిచేస్తున్నారు. శుక్రవారం రాత్రి విధులు ముగించుకొని బైక్‌పై ఇంటికి వెళ్తుండగా ప్రకాష్ నగర్ వద్ద సికింద్రాబాద్ వైపు వెళ్తోన్న రాణిగంజ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నర్సింగరావును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే […]</p>

X
దిశ, బేగంపేట: ఆర్టీసీ బస్సు ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి చెందిన ఘటన బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. బేగంపేట సీఐ శ్రీనివాసులు వివరాల ప్రకారం.. రసూల్‌పుర కృష్ణ నగర్ ప్రాంతానికి నర్సింగరావు(40) స్థానిక హెచ్ఎంటీ కంపెనీలో సెక్యూరిటీగా పనిచేస్తున్నారు. శుక్రవారం రాత్రి విధులు ముగించుకొని బైక్‌పై ఇంటికి వెళ్తుండగా ప్రకాష్ నగర్ వద్ద సికింద్రాబాద్ వైపు వెళ్తోన్న రాణిగంజ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నర్సింగరావును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు. మృతుడికి భార్య సంతోషి, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలిపారు. అనంతరం ఆర్టీసీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Next Story






