సత్యమేవ జయతే అంటున్న ‘వకీల్ సాబ్’

91
Pawan Kalyan, Vakil Saab

దిశ, సినిమా : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ నుంచి 2020 మార్చిలో ఉమెన్స్ డే కానుకగా వచ్చిన తొలిపాట ‘మగువ మగువ’ సంగీత అభిమానుల హృదయాలను దోచుకున్న విషయం తెలిసిందే. తాజాగా ‘సత్యమేవ జయతే’ అంటూ రెండో పాటను రిలీజ్ చేశారు మేకర్స్. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను శంకర్ మహదేవన్, పృథ్వీ చంద్ర అద్భుతంగా పాడారు. కాగా థమన్ అందించిన మ్యూజిక్.. పవర్ స్టార్ స్టామినాను రెట్టింపు చేసేలా ఉంది.

‘జనజన జన.. జనగణమున కలగలసిన జనం మనిషిరా.. మన మన మన మన తరపున నిలబడగల నిజం మనిషిరా’ అంటూ పదునైన పదాలు పవన్ వ్యక్తిత్వాన్ని తలపిస్తున్నాయి. ఇందులోని లిరిక్స్, బీట్.. పవర్ అభిమానులనే కాకుండా సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుండగా, సినిమా కూడా బంపర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఏప్రిల్ 9న విడుదల కానున్న ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..