‘కరోనా సెకండ్ వేవ్‌తో ఆర్థిక రికవరీకి ఆటంకం’

by  |
‘కరోనా సెకండ్ వేవ్‌తో ఆర్థిక రికవరీకి ఆటంకం’
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా సెకెండ్ వేవ్ కారణంగా దేశ ఆర్థికవ్యవస్థ పునరుద్ధరణకు, ముఖ్యంగా బ్యాంకింగ్ రంగానికి ఆటంకం ఏర్పడవచ్చని ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ శుక్రవారం తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశీయ బ్యాంకింగ్ రంగం 2021 క్యాలెండర్ ఏడాదిలో మోస్తరుగా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొనవచ్చని, అయితే, ఇవి తీవ్రమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పెరుగుతున్న కరోనా కేసులు దేశీయ వ్యాపారాలను, ఆర్థిక కార్యకలాపాలను మరింత ప్రభావితం చేసే అంశాలపై అప్రమత్తంగా ఉండాలని ఫిచ్ రేటింగ్స్ హెచ్చరించింది. ప్రభుత్వ స్థిరమైన ఆర్థిక వైఖరి స్వల్పకాలికంగా వృద్ధిపై ఉండే ఒత్తిళ్లను తగ్గిస్తుంది. అయితే, భారత్‌లోని అత్యధిక జనాభాకు వేగంగా, సమర్థవంతంగా టీకాను ఇవ్వడం ద్వారా ఈ ప్రతికూల ప్రమాదాలను అధిగమించవచ్చని ఫిచ్ రేటింగ్స్ అభిప్రాయపడింది. ఇటీవల ఫిచ్ రేటింగ్స్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి 12.8 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. అయితే, కరోనా కేసులు ఏప్రిల్-జూన్ త్రైమాసికం నాటికి మందగించకపోతే వృద్ధికి ఆటంకం ఏర్పడవచ్చని తెలిపింది.



Next Story

Most Viewed