రమణ వెంటే సెకండ్ కేడర్ నాయకులు

by  |
రమణ వెంటే సెకండ్ కేడర్ నాయకులు
X

దిశ, జగిత్యాల : తెలంగాణ టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎల్.రమణ వెంట జగిత్యాల జిల్లాకు చెందిన పలువురు సెకండ్ కేడర్ నాయకులు తమ సభ్యత్వాలకు, పార్టీ పదవులకు ఉమ్మడిగా రాజీనామా చేసి పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి తమ రాజీనామా లేఖను పంపించారు. రాష్ట్ర కార్యదర్శి దెయ్యాల మల్లారెడ్డి, నిజామాబాద్ పార్లమెంట్ అధికార ప్రతినిధి వనమాల నిరంజన్, నిజామాబాద్ పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు కోరుకంటి రాము, జిల్లా కార్యక్రమాల కమిటీ చైర్మన్ ఓల్లాల గంగాధర్ లు ఇతర ప్రజా ప్రతినిధులు ఉమ్మడిగా రాజీనామా చేస్తున్నామని అన్నారు. ఇంతకాలం పార్టీలో వివిధ పదవులు, బాధ్యతలను అప్పగించినందుకు అంకితభావంతో సేవలు అందించామని, మాకు అవకాశం కల్పించిన, చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. మారిన రాజకీయ సమీకరణాలతో ప్రాథమిక సభ్యత్వానికి పదవులకు ఉమ్మడిగా తాము రాజీనామా చేస్తున్నామని, తామంతా రమణ వెంటే ఉంటామని తెలిపారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed