జగన్ సర్కార్‌కి గుడ్ న్యూస్.. వెనక్కి తగ్గిన ఎస్ఈసీ

193

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటింటికి రేషన్ సరుకులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం వాహనాలను ఏర్పాటు చేసింది. అయితే ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో రేషన్ వాహనాల రంగు మార్చాలని ఎస్ఈసీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎస్ఈసీ నిర్ణయంపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. దీంతో హైకోర్టు విచారణ చేపట్టింది. కేసు విచారణ జరుగుతున్న తరుణంలో ఎస్ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. వాహనాల రంగు మార్పుపై ఎస్ఈసీ వెనక్కి తగ్గింది. వాహనాల రంగు మార్చాలన్న ఆదేశాలను వెనక్కి తీసుకుంది. దీంతో హైకోర్టు కేసును డిస్పోజ్ చేసింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..