ఏపీ పంచాయతీ‌రాజ్ అధికారులపై ఎస్ఈసీ చర్యలు

by  |
ap sec
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ‌రాజ్ శాఖ అధికారులపై ఎస్ఈసీ చర్యలు తీసుకుంది. ఓటర్ల జాబితా రూపొందించడంలో నిర్లక్ష్యం వహించారని సీనియర్ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్‌పై వేటు వేసింది. అధికారుల తప్పిదాలను సర్వీస్ రికార్డుల్లో పొందు పర్చాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అధికారుల నిర్లక్ష్యంతో 2021 ఓటర్ల జాబితా సిద్ధం కాలేదని, దీంతో 3.60లక్షల మంది యువ ఓటర్లు ఓటు హక్కు కోల్పోయారని ఎస్ఈసీ పేర్కొంది. విధి నిర్వహణలో విఫలమైన ఇద్దరు అధికారులను బదిలీ చేయాలని ఎస్ఈసీ ఉత్తర్వుల్లో వెల్లడించింది. సాంకేతిక, న్యాయ చిక్కుల వల్ల 2019 జాబితా తోనే ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్ఈసీ స్పష్టం చేసింది.


Next Story

Most Viewed