కొవిడ్​ జాగ్రత్తలు పాటిస్తూనే విధుల్లో పాల్గొనాలి : ఎస్ఈసీ

39

దిశ, ఏపీబ్యూరో : కొవిడ్​జాగ్ర్తత్తలు పాటిస్తూ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొనాలని ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేష్​ కుమార్​సూచించారు. ఆదివారం ఆయన ఉద్యోగులకు ఎస్‌ఈసీ ఓ బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల నిర్వహణలో ఉద్యోగుల అభ్యంతరాలు తమ దృష్టికి వచ్చినట్లు లేఖలో పేర్కొన్నారు. పోలింగ్ సిబ్బంది భద్రతకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పోలింగ్‌ సిబ్బందికి పీపీఈ కిట్లు, ఫేస్‌ షీల్డ్‌, శానిటైజర్ ఇవ్వాలని సూచించామని చెప్పారు.

వ్యాక్సినేషన్‌లో పోలింగ్‌ సిబ్బందికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరామన్నారు. సీఎస్‌తో జరిగిన సమావేశంలోనూ ఇదే స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ రాజ్యాంగ విధి కాబట్టి ఉద్యోగులు తప్పకుండా విధులను నిర్వర్తించాలని రమేశ్ కుమార్ పేర్కొన్నారు. సకాలంలో ఎన్నికలు నిర్వహించకుంటే ఆర్థిక సంఘం నిధులు రావని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ఎన్నికలు జరగాల్సిన అవసరముందని నిమ్మగడ్డ లేఖలో పేర్కొన్నారు.