సివిల్స్-2022 కోచింగ్ కోసం స్క్రీనింగ్​టెస్ట్

by  |
సివిల్స్-2022 కోచింగ్ కోసం స్క్రీనింగ్​టెస్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించే సివిల్ సర్వీసెస్-2022 కోచింగ్ కోసం అభ్యర్థులకు ఈనెల 11వ తేదీన స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ నామోజు బాలాచారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షకు 3,064 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, 11న ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 వరకు రెండో సెషన్ లో పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. మొత్తం వంద ప్రశ్నలుంటాయని, తప్పుగా జవాబు రాసిన ప్రశ్నకు 1/3 నెగటివ్ మార్క్ ఉంటుందని ఆయన తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో కొవిడ్​ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆయన సూచించారు.

Next Story