జోగిపేటకు రైలు మార్గం

51

దిశ, అందోల్ : జోగిపేటకు రైలు మార్గం ఏర్పాటు కానుందని జోగిపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, రైల్వే లైన్ సాధన సమితి అధ్యక్షుడు గంగా జోగినాథ్ గుప్త అన్నారు. మీడియాతో ఆదివారం ఆయన మాట్లాడారు. రైల్వే లైన్ ఏర్పాటుకు దక్షిణ మధ్య రైల్వే రూ.1764 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసిందని తెలిపారు. 18 ఏండ్ల క్రితం తాను రైల్వే లైన్ సాధన సమితి ఏర్పాటు పోరాటం చేస్తున్నట్టు తెలిపారు. అప్పటి నుంచి ప్రధానులు, రైల్వే మంత్రులకు వినతిపత్రాలు ఇచ్చినట్టు తెలిపారు.

ప్రస్తుతం ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్, రైల్వే మంత్రి పీయూష్ గోయల్ సహకారంతో రైల్వేలైన్ నేటికి కార్యరూపం దాల్చిందన్నారు. పటాన్‌చెరు (వట్‌పల్లి, నాగులపల్లి) నుంచి సంగారెడ్డి, జోగిపేట, రంగంపేట మీదుగా మెదక్ జిల్లా కేంద్రం వరకు వరకు రైల్వే లైన్ ఏర్పాటు కోసం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ కార్యాలయం నుంచి రూ.1764 కోట్లతో  కేంద్ర రైల్వే బోర్డ్‌కు డిసెంబర్ 31న ప్రతిపాదనలు పంపినట్టు తెలిపారు. ఇందుకు సహకారం అందించిన పీఎం, సీఎం, రైల్వే మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..