ఘోర ప్రమాదానికి డ్రైవరే కారణమా??

38

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం నక్కనదొడ్డి గ్రామ సమీపంలో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. స్కార్పియో వాహనం బోల్తా పడి ఇద్దరు మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి చెందిన విజయ్ కుమార్(46), కారు డ్రైవర్ తేజేశ్వర వరప్రసాద్(21) ప్రాణాలు కోల్పోయారు.

వాహనంలో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలు అయ్యాయి. వారంతా గుంతకల్లు నుంచి నంద్యాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా వాహనం డివైడర్ ను ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది అని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.