షాకింగ్.. ఆ మంచులో 28 కొత్త వైరస్‌లు!

by  |
ICE
X

దిశ, ఫీచర్స్ : టిబెటన్ పీఠభూమిలోని హిమానీనదం నుంచి తీసిన 15వేల ఏళ్ల క్రితం నాటి మంచు నమూనాలలో 33 కొత్త వైరస్‌లను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అక్కడ ఇవి ఎలా మనుగడ సాగించాయి? వీటి వల్ల మానవాళికి ముప్పు ఏమైనా ఉందా?.

ఒహియో స్టేట్ యూనివర్శిటీకి చెందిన వాతావరణ శాస్త్రవేత్తలు, మైక్రోబయాలజిస్టులతో కలిసి 2015లో గులియా ఐస్ క్యాప్‌పై పరిశోధన సాగించారు. టిబెటన్ పీఠభూమిలో సముద్ర మట్టానికి 22వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ మంచు శిఖరం నుంచి రెండు ఐస్ కోర్లను పరిశోధకులు ల్యాబ్‌కు తీసుకెళ్లి అధ్యయనం చేశారు. మంచును విశ్లేషించిన ఈ బృందం ఇది 15 వేల సంవత్సరాల క్రితం ఏర్పడిందని, అందులో 33 వైరస్‌లను కనుగొన్నట్లుగా వెల్లడించారు.

వీటిలో 28 వైరస్‌లు కొత్తగా ఉద్భవించినట్లు తెలిపారు. ఈ హిమానీనదాలు క్రమంగా ఏర్పడగా దుమ్ము, వాయువులతో పాటు అనేక వైరస్‌లు కూడా ఆ మంచులో నిక్షిప్తమై ఉంటాయని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ వైరస్‌లు శతాబ్దాలుగా ఎలా జీవించగలవో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తామని, ఈ అధ్యయనం కోసం మంచులోని సూక్ష్మజీవులు, వైరస్‌లను కలుషితం చేయకుండా విశ్లేషించే కొత్త అల్ట్రా-క్లీన్ పద్ధతిని కూడా సృష్టించామన్నారు.

పశ్చిమ చైనాలోని హిమానీనదాల వైరస్‌ల గురించి చాలా తక్కువగా తెలుసని, మరిన్ని అధ్యయనాల ద్వారా వీటి రహాస్యాలు తెలుస్తాయని పరిశోధకులు స్పష్టం చేశారు. లభించిన వాటిలో నాలుగు వైరస్‌లు మాత్రం బ్యాక్టీరియా బారినపడే వైరస్ కుటుంబాలకు చెందినవి. మహాసముద్రాలలో లేదా మట్టిలో కనిపిస్తుంటాయని తెలిపారు.

ICE-Virus


Next Story

Most Viewed