మామిడి తోరణాలు, బెలూన్స్, రిబ్బన్ కట్‌లు.. పండగలా ప్రారంభమైన పాఠశాల

by Vadlamudi Anukaran |   (  Updated:2021-09-01 05:15:19  IST  )

<p>దిశ వికారాబాద్: తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ ఒకటి నుంచి అన్ని విద్యా సంస్థలు ప్రారంభించాలని ఆదేశాలు జారీచేయడంతో కొన్ని చోట్ల బడులను పండుగల ప్రారంభించారు. వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గం గౌతాపూర్ గ్రామ ప్రాథమిక పాఠశాలలు ఉపాధ్యాయులు, స్థానిక సర్పంచ్ రాజప్పగౌడ్ రిబ్బన్ కట్ చేసి పాఠశాలను పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠశాలలో స్వాగతం పలికేందుకు మామిడి తోరణాలు బలూన్స్ కట్టారు. పిల్లలకు మాస్కులు, శానిటేషన్ అందజేశారు. విద్యార్థులు వ్యక్తిగత ఆరోగ్యం, పరిశుభ్రతపై శ్రద్ధ [&hellip;]</p>

schools
X

దిశ వికారాబాద్: తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ ఒకటి నుంచి అన్ని విద్యా సంస్థలు ప్రారంభించాలని ఆదేశాలు జారీచేయడంతో కొన్ని చోట్ల బడులను పండుగల ప్రారంభించారు. వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గం గౌతాపూర్ గ్రామ ప్రాథమిక పాఠశాలలు ఉపాధ్యాయులు, స్థానిక సర్పంచ్ రాజప్పగౌడ్ రిబ్బన్ కట్ చేసి పాఠశాలను పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠశాలలో స్వాగతం పలికేందుకు మామిడి తోరణాలు బలూన్స్ కట్టారు. పిల్లలకు మాస్కులు, శానిటేషన్ అందజేశారు. విద్యార్థులు వ్యక్తిగత ఆరోగ్యం, పరిశుభ్రతపై శ్రద్ధ వహించాలని ఈ సందర్భంగా సర్పంచ్, ఉపాధ్యాయులు వివరించారు.

Next Story