అత్యాచార కేసుల్లో… కులాలను బట్టి తీర్పులా?

by  |
అత్యాచార కేసుల్లో… కులాలను బట్టి తీర్పులా?
X

దిశ, హుస్నాబాద్: మహిళలపై జరుగుతున్న అత్యాచార కేసుల్లో కులాలను బట్టి తీర్పులు వస్తున్నాయని ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక కమిటీ చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు. హైదరాబాద్‌లో దళిత యువతిపై 139 మంది, ఐదువేల సార్లు అత్యాచారం చేశారని ఫిర్యాదు చేస్తే సీఎం కేసీఆర్, పోలీసు ఉన్నతాధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

రాష్ట్రంలో వ్యాప్తంగా రోజురోజుకూ దళిత మహిళలపై అనేక దాడులు జరుగుతుంటే, నామమాత్రపు చర్యలతో అధికారులు చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. యువతిపై అత్యాచారం చేసిన నిందితుల్లో సినీ నటులు, రాజకీయ, విద్యార్థి సంఘాల నేతలు ఉండడంతో మహిళా రక్షణ, ప్రజాస్వామ్య విలువలు ఎంతమేర పరిరక్షించపడుతున్నాయో తేటతెల్లమవుతుందన్నారు. దిశ, నిర్భయ వంటి చట్టాలు దళిత, గిరిజన మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు వర్తించవా అని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.


Next Story