- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొన్ని గంటలపాటు నిలిచిపోనున్న ఎస్‌బీఐ బ్యాంకింగ్ సేవలు!
by Harish |
<p>దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఈ నెల 11, 12వ తేదీల్లో తన బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడుతుందని తెలిపింది. శనివారం రాత్రి 11.30 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటల వరకు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఉంటుందని, టెక్నాలజీ అప్‌గ్రేడ్ ప్రక్రియలో భాగంగానే ఈ అంతరాయం ఉంటుందని ఎస్‌బీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. నిర్ణయించిన రెండు రోజుల్లో ఆన్‌లైన్ నెట్ బ్యాంకింగ్ సేవలు పనిచేయవని, ఖాతాదారులకు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఈ నెల 11, 12వ తేదీల్లో తన బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడుతుందని తెలిపింది. శనివారం రాత్రి 11.30 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటల వరకు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఉంటుందని, టెక్నాలజీ అప్‌గ్రేడ్ ప్రక్రియలో భాగంగానే ఈ అంతరాయం ఉంటుందని ఎస్‌బీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది.
నిర్ణయించిన రెండు రోజుల్లో ఆన్‌లైన్ నెట్ బ్యాంకింగ్ సేవలు పనిచేయవని, ఖాతాదారులకు మెరుగైన బ్యాంకింగ్ సౌకర్యాలను మరింత సమర్థవంతంగా అందించడం కోసమే ఈ ప్రక్రియని బ్యాంకు పేర్కొంది. ఈ సమయంలో ఎస్‌బీఐ బ్యాంకింగ్ ఇంటర్నెట్‌తో పాటు యోనో యాప్, యోనో లైట్, యూపీఐ చెల్లింపుల సేవలు, ఐఎంపీఎస్ లాంటి అన్ని రకాల సర్వీసులు నిలిచిపోతాయని బ్యాంకు వివరించింది.
Next Story






