పెరిగిన ఎస్‌బీఐ లైఫ్ లాభాలు

by  |
పెరిగిన ఎస్‌బీఐ లైఫ్ లాభాలు
X

దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ ‌తో ముగిసిన త్రైమాసికంలో ఎస్‌బీఐ లైఫ్ నికర లాభం రెండు రెట్లు పెరిగి రూ. 299.73 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ. 129.84 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. సమీక్షించిన త్రైమాసికంలో సంస్థ మొత్తం ఆదాయం 45 శాతం పెరిగి రూ. 18,458.25 కోట్లకు చేరుకుందని, గతేడాది ఇదే త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ. 12,745.38 కోట్లుగా ఉందని రెగ్యులేటరీ ఫైలింగ్‌ లో పేర్కొంది. ఈ త్రైమాసికంలో సంస్థ నికర ప్రీమియం ఆదాయం 22 శాతం పెరిగి రూ. 12,857.95 కోట్లకు చేరుకుంది.

నిర్వహణ ఆస్తులు సెప్టెంబర్ 30 నాటికి గతేడాదిలో ఉన్న రూ. 1,54,760 కోట్ల నుంచి రూ. 1,86,360 కోట్లకు పెరిగింది. పాలసీ బాధ్యతలు, అంతకంటే కొవిడ్-19 మహమ్మారి ఫలితంగా ఎస్‌బీఐ లైఫ్ అదనపు నిల్వలను రూ. 64.76 కోట్లను ఉచినట్టు, కొవిడ్-19కు సంబంధించి భవిష్యత్తు పరిణామాలను కంపెనీ నిశితంగా పరిశీలిస్తోందని ఎస్‌బీఐ లైఫ్ తెలిపింది. సంస్థ వ్యాపారం, ఆర్థిక స్థితిపై కరోనా ప్రభావం ఉందని, సవాళ్లను అధిగమించి ముందుకెళ్లనున్నట్టు పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఎస్‌బీఐ లైఫ్ షేర్లు సెన్సెక్స్‌ లో 1.10 శాతం పెరిగి రూ. 778.75 వద్ద ముగిశాయి.


Next Story

Most Viewed