‘బీబీ3’లో సయేషా సైగల్..

by  |
‘బీబీ3’లో సయేషా సైగల్..
X

దిశ, వెబ్‌డెస్క్ : నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ.. ఫుల్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ రిలీజ్ కాగా.. ఊర మాస్ డైలాగ్‌తో అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంటోంది. కాగా ఈ చిత్రంలో బాలయ్య డ్యూయల్ రోల్ ప్లే చేయబోతున్నారని తెలుస్తుండగా.. హీరోయిన్ల గురించి పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా ఈ విషయంపై క్లారిటీనిస్తూ అఫిషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది మూవీ యూనిట్. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై సినిమా రూపుదిద్దుకుంటుండగా.. హీరోయిన్ సయేషా సైగల్‌కు వెల్ కమ్ చెప్తూ ట్వీట్ చేసింది. త్వరలో తను కూడా మూవీ యూనిట్‌తో జాయిన్ కాబోతున్నట్లు వెల్లడించింది.

ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉండగా.. మరో హీరోయిన్‌గా ప్రగ్యా జైస్వాల్ ఫైనల్ అయినట్లు సమాచారం. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కాగా సయేషాకు వెల్‌కమ్ చెప్తున్న ఫ్యాన్స్.. టైటిల్ అప్‌డేట్, ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నట్లు చెప్తున్నారు.

https://twitter.com/sayyeshaa/status/1326028564639047686?s=20

Advertisement
Next Story

Most Viewed