సమంత ఎలాంటిదో నాకు అంతా తెలుసు.. స్టార్ యాక్టర్

by  |
samantha
X

దిశ, సినిమా: బాలీవుడ్ ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ తాజాగా సమంత గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ మేరకు ‘ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా’ (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) చర్చా వేదికలో మనోజ్‌తో పాటు సమంత, ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్‌ దర్శకులు రాజ్‌ అండ్‌ డీకే పాల్గొనగా.. ఈ సందర్భంగా మీడియాతో పలు విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలోనే సమంత, తన నటన గురించి వివరించిన బాజ్ పాయ్.. ‘సామ్ మంచి మనసున్న అమ్మాయే కాదు. గొప్ప నటి కూడా. నేను రెండోసారి ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ చూస్తున్నప్పుడు అర్థమైంది. ఆమె ఫోకస్, ఇంటెన్సిటీ, మెయింటైన్ చేసిన గ్రాఫ్, ఆమె చేసిన రీసెర్చ్ అన్నింటినీ చూసి ఆశ్యర్యపోయాను.

ఈ సిరీస్‌లో క్యారెక్టర్ గురించి చాలా కష్టపడింది. తను మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్‌కి వెళ్లిన వీడియోలను దర్శకులిద్దరూ నాకు చూపించారు. ఆమె పూర్తిగా ప్రిపేర్ అయిన తర్వాతే ఈ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకుందని అర్థమైంది. అలాగే టాలీవుడ్, కోలీవుడ్‌లో సమంత పెద్ద స్టార్ అని కూడా నాకు తెలుసు’ అన్నాడు. అలాగే ‘వరుస ఆఫర్ల టైమ్‌లోనే ఈ సీరిస్ అవకాశం వచ్చింది. ఆ సమయంలో ఏ ప్రాజెక్ట్ ఎంపిక చేసుకోవాలన్నా కాస్త భయపడేవాడిని. ఎలాంటి ప్రాజెక్టుల్లో నటించకూడదు అనే విషయంలో స్పష్టత ఉంది. కానీ, ఎలాంటి వాటిల్లో నటించాలి అనే విషయంలో క్లారిటీ లేదు. అందుకే ‘ఫ్యామిలీ మ్యాన్‌’కు నో చెప్పాలనుకున్నా. కానీ చివరకు వద్దనుకున్నదే నాకు మంచి పేరు తీసుకొచ్చింది’ అని వివరించాడు మనోజ్ బాజ్‌పాయ్.

ఆ ప్రేమ జంటను విడగొట్టిన నయనతార..???


Next Story