- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆదిలాబాద్‌లో ‘సేవ్ ట్రైబల్స్ ఫ్రం టైగర్స్’ఉద్యమం..
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఆదిలాబాద్ జిల్లాలో అడవి బిడ్డలు మరో ఉద్యమానికి తెరలేపారు. ఇటీవల ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్దపులి దాడులు పెరిగిపోవడంతో వారంతా బిక్కుబిక్కుమంటూ బతుకీడుస్తున్నారు. పులులను పట్టుకోవడంలో ఫారెస్టు అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. తమను, పశువులను పులుల బారి నుంచి రక్షించాలని కోరుతూ ‘సేవ్ ట్రైబల్స్ ఫ్రం టైగర్స్’ఉద్యమానికి తెరలేపారు. 150కు పైగా ఆదివాసీ గూడాల్లో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఇదిలాఉండగా, ఆదివాసీ ప్రాంతాల్లో పులులను వదిలేశారని ఎంపీ సోయం బాబూరావు ఆరోపించారు. ఆదివాసీ బిడ్డలను అడవుల […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఆదిలాబాద్ జిల్లాలో అడవి బిడ్డలు మరో ఉద్యమానికి తెరలేపారు. ఇటీవల ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్దపులి దాడులు పెరిగిపోవడంతో వారంతా బిక్కుబిక్కుమంటూ బతుకీడుస్తున్నారు. పులులను పట్టుకోవడంలో ఫారెస్టు అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. తమను, పశువులను పులుల బారి నుంచి రక్షించాలని కోరుతూ ‘సేవ్ ట్రైబల్స్ ఫ్రం టైగర్స్’ఉద్యమానికి తెరలేపారు. 150కు పైగా ఆదివాసీ గూడాల్లో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు.
ఇదిలాఉండగా, ఆదివాసీ ప్రాంతాల్లో పులులను వదిలేశారని ఎంపీ సోయం బాబూరావు ఆరోపించారు. ఆదివాసీ బిడ్డలను అడవుల నుంచి వెళ్లగొట్టేందుకు కుట్ర చేస్తున్నారంటూ మండి పడ్డారు. కాగా, అడవులు గిరిజనులకు చెందినవని.. అందులో తాము స్వేచ్ఛగా బతికేందుకు అవకాశం కల్పించాలని ఆదివాసీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
Next Story






