20 దేశాల ప్రయాణికులపై సౌదీ అరేబియా ఆంక్షలు

by  |
20 దేశాల ప్రయాణికులపై సౌదీ అరేబియా ఆంక్షలు
X

రియాద్: కరోనా మహమ్మారి వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా 20 దేశాల ప్రయాణికుల రాకపోకలపై మంగళవారం సౌదీ అరేబియా ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించింది. ఇందులో భారత్, అమెరికా దేశాలు కూడా ఉన్నాయి. బుధవారం నుంచి నిషేధం అమలులోకి వస్తుందని, కానీ, రాయబారులు, సౌదీ అరేబియా పౌరులు, వైద్య విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులకు ఆంక్షలు వర్తించవని స్పష్టం చేసింది. అయితే, సౌదీ అరేబియా పొరుగు దేశాలు ఈజిప్టు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు సైతం నిషేధిత జాబితా ఉండటం గమనార్హం. లెబనన్, టర్కీ, ఐర్లాండ్, ఇటలీ, పోర్చుగల్, స్వీడన్, స్విట్జర్లాండ్, అమెరికా, భారత్‌తోపాటు అర్జెంటీనా, బ్రెజిల్, ఇండోనేషియా, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా దేశాలు నిషేధిత జాబితాలో ఉన్నాయి. అంతేకాకుండా నిషేధం అమలు రావడం కంటే ముందు 14 రోజుల్లో 20 దేశాల గుండా ప్రయాణించిన వారిపై కూడా తాత్కాలిక నిషేధం అమలులో ఉంటుందని తెలిపింది. యూకేలో కొత్త రకం కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన తర్వాత అప్రమత్తమైన సౌదీ అరేబియా ప్రభుత్వం డిసెంబర్‌లో ‘తాత్కాలిక ప్రయాణ నిషేధం’ విధించింది. గత నెల 2న అంతర్జాతీయ వైమానిక సేవలను పునరుద్ధరించింది.


Next Story

Most Viewed