ఈ రాశి వారి బ్యాంక్ బ్యాలెన్స్ పెరగనుంది

by  |
Panchangam
X

తేది : 10, జూలై 2021
ప్రదేశము : హైదరాబాద్ ,ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : జ్యేష్ఠమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : శనివారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : అమావాస్య
(నిన్న తెల్లవారుజాము 5 గం॥ 18 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 6 గం॥ 45 ని॥ వరకు)
నక్షత్రం : పునర్వసు
(నిన్న రాత్రి 11 గం॥ 13 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 1 గం॥ 0 ని॥ వరకు)
యోగము : వ్యాఘాతము
కరణం : నాగ
వర్జ్యం : (ఈరోజు ఉదయం 12 గం॥ 6 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 49 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు రాత్రి 10 గం॥ 25 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 0 గం॥ 8 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 7 గం॥ 32 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 24 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 9 గం॥ 4 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 42 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు తెల్లవారుజాము 5 గంటలకు)

మేష రాశి: ఆత్మవిశ్వాసంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. దైవ ప్రార్ధన వలన అన్ని పనుల్లో విజయం. ఇంతకు ముందు పెట్టిన పెట్టుబడుల ద్వారా లాభాలు. ఆఫీసు పనులను సకాలంలో పూర్తి చేస్తారు. మీ పని సామర్థ్యం పై అందరి ప్రశంసలు ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. సోదరుల సహాయం లభిస్తుంది. పెళ్లికాని వారికి సంబంధం కుదిరే అవకాశం. ఇతరులతో వాదోపవాదాలకు దిగకండి దానివల్ల సమయం వృధా. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఈ రోజు ఒక తీపి గుర్తు.

వృషభ రాశి: దైవ ప్రార్ధన వలన మానసిక బలం. స్థిరాస్తి వ్యవహారాలు మీకు అనుకూలం. ముఖ్యమైన నిర్ణయాలను ధైర్యంగా తీసుకోండి. ఆఫీసులో పనులను సకాలంలో చకచకా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు వారితో గడపడం వల్ల మీకు ఎంతో ఎనర్జీ. ముఖ్య అవసరాలకు మాత్రమే ఖర్చు పెట్టండి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. బయట భోజనం కన్నా ఇంటి భోజనం మిన్న. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన మీ వైవాహిక జీవితపు తొలి రోజులను గుర్తుకు తెస్తుంది.

మిధున రాశి: పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఒత్తిడిని అధిగమించడానికి ప్రయత్నించండి. ఆఫీసు పనులలో తోటి ఉద్యోగుల వలన కొన్ని ఆటంకాలు. కుటుంబ సభ్యులకు కొంత సమయం కేటాయించండి వారితో గడపటం వలన మీకు ఎంతో ఎనర్జీ. ప్రయాణాలలో డబ్బు వస్తువులు జాగ్రత్త. అవసరాలకు మాత్రమే ఖర్చు పెట్టండి. మీ భార్య భర్తలు ప్రతి చిన్న విషయానికి గొడవ పడటం మానెయ్యండి. వ్యాపారస్తులకు వ్యాపారం లో లాభాలు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన మీ వైవాహిక జీవితపు తొలి రోజులను గుర్తుకు తెస్తుంది.

కర్కాటక రాశి: ఒత్తిడిని అధిగమించడానికి ప్రయత్నించండి. దైవ ప్రార్థన మెడిటేషన్ మంచి ఉపాయాలు కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి. ఒక శుభవార్త అవుతుంది దాని వలన కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం. మీ భార్య పేరు మీద చేసే వ్యాపారాలు కలసి వస్తాయి. ఆఫీసు పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. మీ పై అధికారులు మిమ్మల్ని గమనిస్తున్నారు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.

కన్యారాశి: ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలను ధైర్యంగా తీసుకోండి. దానధర్మాలు చేయడం వలన దైవ బలం. మీ పిల్లల చదువులను ఒక కంట గమనించండి. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఆఫీసులో పనులు సకాలంలో పూర్తి చేస్తారు తోటి ఉద్యోగుల మరియు పై అధికారుల ప్రశంసలు పొందుతారు. కొంతమంది ఉద్యోగులకు జీతాలు పెరుగుదల. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో తీపి గుర్తు.

సింహరాశి: ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఈరోజు ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తారు. ఆఫీసులో పనులను చకచకా పూర్తి చేస్తారు. కొంతమంది ఉద్యోగులకు జీతంలో పెరుగుదల. కుటుంబ సభ్యులతో కుటుంబ వ్యవహారాల గురించి చర్చిస్తారు. మీ ఇంటికి కొత్తగా పాప /బాబు రాబోతున్నారు ఆనందించండి. జల్సాలు చేయటం వలన సమయం వృధా. అధిక శ్రమ వలన తలనొప్పి. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజు.

ధనుస్సు రాశి: ఆశావహ దృక్పథంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. మీ పిల్లల చదువులను ఒక కంట గమనించండి. వారు చదువు మీద శ్రద్ధ పెట్టకుండా సమయం వృధా చేస్తున్నారు. స్థిరాస్తి వ్యవహారాలు మీకు వ్యతిరేకం కావచ్చు అధైర్య పడకండి. ఆఫీసు పనులలో అధిక శ్రమ. పట్టుదలతో సకాలంలో పనులను పూర్తి చేయటానికి ప్రయత్నించండి. ఆదాయ వ్యవహారాలు మరింత మెరుగు పడతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది కుటుంబ సభ్యులకు కొంత సమయం కేటాయించండి. దేవాలయాలను సందర్శిస్తారు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.

వృశ్చిక రాశి: ఒత్తిడిని అధిగమించడానికి ప్రయత్నం చేయండి. లేకుంటే ఆరోగ్యం పాడవుతుంది. దైవ ప్రార్థన, మెడిటేషన్ మంచి ఉపాయాలు ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. గందరగోళం వదిలేయండి. ఆదాయం పరవాలేదు. డబ్బును సరైన పథకాల్లో పెట్టుబడులు పెట్టండి. మీ తల్లి గారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు పాత గొడవలు మర్చిపోండి మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు గడపండి.

తులారాశి: సహనంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి. ఆడంబరాలకై మీరు చేస్తున్న ఖర్చు వలన ఇంట్లో పెద్ద వారు బాధ పడతారు. అనుకోని అతిథుల వలన ఇబ్బందులు పడతారు. ఆఫీస్ పనుల్లో అదనపు బాధ్యతలు వలన అధిక శ్రమ. పనులు సకాలంలో పూర్తి కావాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. ఆదాయం పరవాలేదు అవసరాలకు మాత్రమే ఖర్చు పెట్టండి ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజు.

మకర రాశి: వ్యాపారస్తులకు వ్యాపారం లో లాభాలు. కొత్త పెట్టుబడులు పెడతారు వ్యాపార విస్తరణ చేస్తారు. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. పొగత్రాగడం మానేయండి. ఒత్తిడిని అధిగమించడానికి ప్రయత్నించండి. మెడిటేషన్ ఒక మంచి ఉపాయం. కుటుంబ సభ్యులతో కుటుంబ వ్యవహారాల గురించి చర్చిస్తారు. మీ ఇంటికి కొత్తగా పాప బాబు రాబోతున్నారు ఆనందించండి. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు పాత గొడవలు మర్చిపోండి. ఒకరిమీద ఒకరు నమ్మకం పెంచుకోవడానికి ప్రయత్నించండి.

కుంభరాశి: ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఆఫీసు పనుల్లో అదనపు బాధ్యతలు వలన అధిక శ్రమ. దానివలన పనులు చేయడం కష్టమవుతుంది. అయినా పట్టుదలతో ప్రయత్నించండి. వ్యాపారస్తులకు వ్యాపారం లో లాభాలు. కుటుంబ సభ్యులకు కొంత సమయం కేటాయించండి వారితో గడపడం వల్ల మీకు ఎంతో ఎనర్జీ. ఆదాయ వ్యవహారాలు సాధారణం. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

మీన రాశి: ఆరోగ్యంపట్ల జాగ్రత్త వహించండి. ముఖ్యంగా బిపి షుగర్ ఉన్న వాళ్ళు జాగ్రత్త. కొత్త పెట్టుబడులు పెట్టబోయే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి వీలైతే అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. కుటుంబ సభ్యులకు కొంత సమయం కేటాయించండి ముఖ్యంగా పిల్లలతో గడపడం వల్ల మీకు ఎంతో ఎనర్జీ. అనుకోని అతిథుల వలన ఇబ్బందులు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.



Next Story

Most Viewed