రాశి ప్రకారం మీ రోజు ఎలా గడుస్తుందో తెలుసుకోండిలా..

by  |
Panchangam
X

ప్రదేశము : హైదరాబాద్ ,ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : జ్యేష్ఠమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : శనివారం
పక్షం : శుక్లపక్షం
తిథి : నవమి
(నిన్న రాత్రి 8 గం॥ 36 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 6 గం॥ 41 ని॥ వరకు)
నక్షత్రం : హస్త
(నిన్న రాత్రి 9 గం॥ 34 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 8 గం॥ 24 ని॥ వరకు)
యోగము : వరియానము
కరణం : బాలవ
వర్జ్యం : (తెల్లవారుజాము 5 గం॥ 33 ని॥ నుంచి ఉదయం 7 గం॥ 4 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : ( మధ్యాహ్నం 2 గం॥ 41 ని॥ నుంచి సాయంత్రం 4 గం॥ 12 ని॥ వరకు)
దుర్ముహూర్తం : ( ఉదయం 7 గం॥ 27 ని॥ నుంచి 8 గం॥ 19 ని॥ వరకు)
రాహుకాలం : ( ఉదయం 8 గం॥ 59 ని॥ నుంచి 10 గం॥ 37 ని॥ వరకు)
గుళికకాలం : ( తెల్లవారు జాము 5 గం॥ 42 ని॥ నుంచి ఉదయం 7 గం॥ 20 ని॥ వరకు)
యమగండం : (మధ్యాహ్నం 1 గం॥ 55 ని॥ నుంచి సాయంత్రం 3 గం॥ 33 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 42 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 52 ని॥ లకు
సూర్యరాశి : మిథునము
చంద్రరాశి : కన్య

మేషరాశి : నిర్ణయాలు తీసుకోవడానికి సరైన సమయం. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం. మీ పిల్లల ప్రగతి మీకు ఎంతో గర్వకారణం. రోగాలు నయమవుతాయి ఆరోగ్యం చక్కబడుతుంది. ఫిట్ నెస్ పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. కావలసినంత డబ్బు చేతికి పొందుతుంది. సరైన పథకాల్లో పెట్టుబడులు పెట్టండి. కొంతమందికి జీతాలు లో పెరుగుదల. ఆఫీసులో పనులనూ చాకచక్యంగా పూర్తిచేస్తారు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీకు ఒక ఆశ్చర్యకరమైన గిఫ్ట్ ఇవ్వబోతున్నారు ఆనందించండి.

వృషభ రాశి : ఒత్తిడిని అధిగమించడానికి మెడిటేషన్ చేయండి. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. డబ్బు పెట్టుబడులకు సంబంధించిన పథకాల గురించి పూర్తి వివరాలను సేకరించండి. ఇతరులతో వాదోపవాదాలకు దిగకండి. ఆఫీసు పనులలో ఇబ్బందులు సరైన ప్రణాళికతో పనులను పూర్తి చేయండి. బంధువుల సహాయ సహకారాలు అందుతాయి. ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువ. అనవసరపు ఖర్చులను చెయ్యకండి ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క హాస్యచతుర సంభాషణ మీకు ఎంతో ఆనందం ఇస్తుంది.

మిధున రాశి : పట్టుదల ఆశావహ దృక్పథంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. వారికి తగినంత సమయం కేటాయించండి వారితో మనసు విప్పి మాట్లాడండి. స్థిరాస్తి లావాదేవీలను పక్కన పెట్టండి. డబ్బు సంపాదన కోసం ఈ మార్గాలను అన్వేషిస్తారు. మీ కుటుంబ వ్యవహారాల లోనికి మూడో వ్యక్తిని రానీయకండి ముఖ్యంగా బంధువులను. ఆఫీసు పనులలో ఆటంకాలు ఉన్నా శ్రమతో అన్ని పనులను పూర్తిచేస్తారు. ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ. ఈ రాశి స్త్రీలకు కుటుంబంలోని ఒక వ్యక్తి అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.

కర్కాటక రాశి : అన్నివిధాలా అనుకూలమైన రోజు. గందరగోళం వదిలేయండి. సరైన కమ్యూనికేషన్ పెంచుకోండి. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం. కొంతమంది ఇంటికి కొత్తగా పాప /బాబు రాబోతున్నారు. ఆఫీసు పనులను చాకచక్యంగా పూర్తిచేస్తారు తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు లభిస్తాయి. కావాల్సినంత ధనం చేతికందుతుంది సరైన పథకాల్లో పెట్టుబడులు పెట్టండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన మీ వైవాహిక జీవితపు తొలి రోజులను గుర్తుకు తెస్తుంది.

సింహరాశి : ఆశావహ దృక్పథం మరియు పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఆఫీసు పనులలో అధిక శ్రమ, ఒత్తిడిని అధిగమించడానికి సరైన ప్రణాళిక వేసుకొని పనులు పూర్తి చేయండి. కుటుంబంలోని వారి కోసం కొంత సమయం కేటాయించండి వారితో మనసు విప్పి మాట్లాడండి. వివాహం కాని వారికి సంబంధం కుదిరే అవకాశం. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువ. కుటుంబ అవసరాల కోసం ఎక్కువ ఖర్చు పెట్టడం వలన డబ్బుకు ఇబ్బంది. ఫిట్ నెస్ కొరకు ప్రయత్నాలు చేస్తారు. అధిక శ్రమ వలన తలనొప్పి. ఈ రాశి స్త్రీలకు పాత గొడవలు అన్ని మరిచిపోయి మీ భర్తతో ఆనందంగా గడపండి.

కన్యరాశి : సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా ప్రముఖులతో పరిచయాలు. ఇంతకు ముందు పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలను తెస్తాయి. ఇతరులతో అనవసర వాదోపవాదాలకు దిగకండి. తీసుకున్న అప్పులను తీర్చడానికి డబ్బు ఇబ్బంది వస్తుంది. ఆఫీసు పనులను సకాలంలో పూర్తి చేయాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. మీ పిల్లల తరగతి మీకు ఎంతో గర్వకారణం. మీరు అద్దెకు ఇవ్వాలనుకుంటున్న మీ ఇంటికి మంచి టెనంట్స్ వస్తారు. ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ. అనవసరపు దుబారా ఖర్చులు చేయడం వల్ల డబ్బు నష్టం. అధిక శ్రమ వలన బిపి. ఆరోగ్యం పూర్తిగా చక్క పడాలంటే ఫిట్ నెస్ కోసం ప్రయత్నాలు చేయండి. ఈ రాశి స్త్రీలకు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

తులారాశి : సంఘంలో పేరుప్రతిష్టలు. మీ ఇంటికి కొత్తగా పాప /బాబు రాబోతున్నారు. వ్యాపారస్తులకు వ్యాపారం లో లాభాలు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు. సర్దుకుపోవడం వలన కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం. అధిక శ్రమ వలన కాళ్ళనొప్పులు. ఫిట్ నెస్ కోసం ప్రయత్నాలు చేస్తారు. ఆఫీసు పనులలో అదనపు బాధ్యతలను మీరు మోస్తున్నంత కాలం పెడుతూనే ఉంటారు జాగ్రత్త. ఆధ్యాత్మిక మార్గం పట్ల ఆసక్తి కనబరుస్తారు. ఈ రాశి స్త్రీల కి మీ భర్త యొక్క అనారోగ్యం వలన మీకు మానసిక అశాంతి.

వృశ్చిక రాశి : అన్నివిధాలా అనుకూలమైన రోజు. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు. ముఖ్యమైన నిర్ణయాలను మీరే తీసుకోండి. కుటుంబంలోని పెద్దవారితో ఆదాయ వ్యవహారాల గురించి మాట్లాడండి వారి సలహా తీసుకోండి. ఆఫీసు పనులలో తోటి ఉద్యోగుల మరియు పై అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. పనులు పూర్తి చేస్తారు. భార్యాభర్తలు పాత గొడవలు తవ్వుకొని సంబంధాలు పాడు చేసుకోకండి. కావలసినంత ధనం చేతికందుతుంది పొదుపు చేస్తారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడండి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

ధనస్సు రాశి : ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. మరింత డబ్బు సంపాదన కోసం నూతన మార్గాలను అన్వేషిస్తారు. సరైన పథకాల లో పెట్టుబడులు పెట్టండి. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఆఫీసు పనులను సకాలంలో పూర్తి చేస్తారు పై అధికారుల ప్రశంసలు. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి. కుటుంబంలోని వ్యక్తుల తో మనసు విప్పి మాట్లాడండి. వారు మీ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ రాశి స్త్రీలు కుటుంబంలోని వ్యక్తులు మీకు తగిన విలువ ఇవ్వటం లేదని బాధ పడతారు.

మకర రాశి : ఒత్తిడిని అధిగమించడానికి దైవ ప్రార్థన ఒక మంచి ఉపాయం. ఇతరులతో వాదోపవాదాలకు దిగడం వలన సమయం వృధా స్థిరాస్తి అమ్మకం వలన అనుకోని లాభాలు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు వారి శ్రమకు తగిన ఫలితం. సంఘంలో పేరుప్రతిష్టలు. ఆఫీసులో పనులు సకాలంలో పూర్తి కావాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా ప్రముఖులతో పరిచయాలు. అధిక శ్రమ వలన కాళ్ళనొప్పులు. ఫిట్ నెస్ పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త పాత గొడవలు మరిచిపోయి మీతో ఆనందంగా ఉండడానికి వస్తున్నారు స్వాగతించండి.

కుంభరాశి : ఆత్మవిశ్వాసం పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేయండి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేయాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. ప్రయాణాలలో వస్తువులు జాగ్రత్త. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి. వారితో కలిసి ఆనందంగా ఉండడం వలన ఎంతో ఎనర్జీ. అధిక శ్రమ వలన కాళ్ల నొప్పులు.ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీతో తగినంత సమయం గడపడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.

మీన రాశి : అన్నివిధాలా అనుకూలమైన రోజు. స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. పై చదువుల కొరకు ప్రయత్నాలు చేస్తున్న విద్యార్థులకు శుభవార్త. కొంతమందికి ఉద్యోగపరంగా ప్రయాణాలు. ఫిట్ నెస్ కొరకు మీరు చేస్తున్న ప్రయత్నాలు సఫలం. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. కావలసినంత ధనం చేతికందుతుంది. సరైన పథకాల్లో పెట్టుబడులు పెడతారు. ఆఫీసు పనులు సకాలంలో పూర్తి చేస్తారు పై అధికారుల ప్రశంసలు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వస్తువులను జాగ్రత్తగా భద్రపరుచుకోండి. ఈ రాశి స్త్రీలకు మీ భార్యాభర్తల మధ్య అన్యోన్యత కొరకు మనసువిప్పి మాట్లాడుకోండి.


Next Story