శనివారం పంచాంగం, రాశిఫలాలు (22-05-2021)

by  |
శనివారం పంచాంగం, రాశిఫలాలు (22-05-2021)
X

ప్రదేశము : హైదరాబాద్ ,ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : వైశాఖమాసం
ఋతువు : వసంత ఋతువు
కాలము : వేసవికాలం
వారము : శనివారం
పక్షం : శుక్లపక్షం
తిథి : దశమి
(నిన్న ఉదయం 11 గం॥ 7 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 9 గం॥ 13 ని॥ వరకు)
నక్షత్రం : ఉత్తర
(నిన్న సాయంత్రం 3 గం॥ 18 ని॥ నుంచి
ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 1 ని॥ వరకు)
యోగము : వజ్రము
కరణం : గరజ
వర్జ్యం : ( రాత్రి 9 గం॥ 46 ని॥ నుంచి 11 గం॥ 14 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఉదయం 7 గం॥ 12 ని॥ నుంచి 8 గం॥ 42 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఉదయం 7 గం॥ 26 ని॥ నుంచి 8 గం॥ 18 ని॥ వరకు)
రాహుకాలం : (ఉదయం 8 గం॥ 57 ని॥ నుంచి 10 గం॥ 34 ని॥ వరకు)
గుళికకాలం : (తెల్లవారు జాము 5 గం॥ 42 ని॥ నుంచి 7 గం॥ 19 ని॥ వరకు)
యమగండం : (మధ్యాహ్నం 1 గం॥ 50 ని॥ నుంచి సాయంత్రం 3 గం॥ 27 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 42 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 43 ని॥ లకు
సూర్యరాశి : వృషభము
చంద్రరాశి : కన్య

వృషభ రాశి : ఈ కరోనా సమయంలో ఇల్లు మాత్రమే పదిలం. కుటుంబ సభ్యులతో, ఆత్మీయులతో మనసు విప్పి మాట్లాడండి అపార్ధాలు తొలగించుకోండి. ఆస్తి వివాదాలు ఇబ్బందికరంగా మారవచ్చు. వ్యాపారాలు సాధారణంగా నడుస్తాయి. చెడు ఊహించ వద్దు. చిరకాల కోరిక ఒకటి తీరుతుంది కానీ పూర్తి అయిన తర్వాతే అన్ని విషయాలు అందరితో పంచుకోండి. ఈ రాశి స్త్రీలకు సొంత మనుషుల ద్వారా ఆశించిన పనులు నెరవేరవు.

మేష రాశి : ఆత్మీయుల వల్ల మేలు జరుగుతుంది. ఈ కరోనా సమయంలో ఫిజికల్ ఫిట్ నెస్ చాలా అవసరం. గృహ వాహనాలు కొనుగోలు చేసే అవకాశం. ఉద్యోగంలో నెలకొన్న వివాదాలు ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపారంలో ఇంతకాలం పడిన శ్రమ ఫలితాన్ని ఇస్తుంది. జీవిత భాగస్వామి ఆనారోగ్యం ఇబ్బంది కలిగిస్తుంది. అలాగే బయట నుంచి తెచ్చిన ఆహారం కూడా అనారోగ్యానికి గురి చేయవచ్చు. ఈ రాశి స్త్రీలకు చిట్ ఫండ్స్ యొక్క మోసాలకు గురి అయ్యే అవకాశం జాగ్రత్తగా ఉండండి.

మిధున రాశి : అనుకున్న మేరకు డబ్బు చేతికందుతుంది. ఈ కరోనా సమయంలో డబ్బు లేని వారికి వీలైనంత సహాయం చేయండి. మీ కుటుంబ సభ్యులకు కాలం విలువ మరియు దాని సద్వినియోగం గురించి వివరంగా చెప్పండి. లేని పోని అనుమానాలకు తావు ఇవ్వకండి. దేనికి తొందరపడవద్దు. అంతా మంచే జరుగుతుంది. ఉద్యోగంలో స్థానచలనం భయం ఉన్నా ఏమీ కాదు. ఈ రాశి స్త్రీలకు ఉద్యోగంలో బాధ్యతలు అధికార దర్పం పెరుగుతాయి.

కర్కాటక రాశి : పాతబాకీలు వసూలవుతాయి. నలుగురిని అన్ని విషయాలలో కలుపుకు పోవాలి. కొత్త పనులు చేపట్టే సమయానికి పోటీ చేస్తారు. చిన్ననాటి స్నేహితులు కలిసి మధుర స్మృతులను గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సమాజంలో పేరు ప్రతిష్టలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల కోర్కెల లిస్టుకు అంతు ఉండదు. ఉద్యోగం లో సమస్యలు తొలగి పోతాయి ఈ రాశి స్త్రీలకు కళ సాంస్కృతిక రంగాలలో గుర్తింపు లభిస్తుంది.

కన్య రాశి : బంగారం మీద పెట్టుబడులు మంచి లాభాలు తెస్తాయి. చుట్టుపక్కల వారితో, సన్నిహితులతో గొడవలు పడకండి లేనిపోని అశాంతి. ఓర్పుతో సంభాషించండి. వైవాహిక జీవితంలో ఇంతకు ముందు ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపార విస్తరణ లో అడ్డంకులను అధిగమిస్తారు. రాజకీయ వర్గాలకు ఉన్నతస్థాయి నుంచి శుభవార్తలు అందుతాయి. ఈ రాశి స్త్రీలకు అయిన వారి నుంచి తగిన సహాయం అందుతుంది.

సింహరాశి : ఈ కరోనా సమయంలో జీవితం విలువ కుటుంబ వ్యక్తుల విలువ గ్రహించండి. అనుకున్న వ్యవహారాలలో విజయం సాదిస్తారు. అనుకున్న విధంగా ధనం చేతికందుతుంది మానసిక శాంతి లభిస్తుంది. విద్యార్థులు చదువు మీద పూర్తి శ్రద్ధ పెట్టండి అవకాశాలు లభిస్తాయి. అభిమానించే వారి నుండి ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగంలో హోదాను నిలుపుకుంటారు. ఈ రాశి స్త్రీలకు కళా రంగం వారికి కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంది.

తులారాశి : ఆత్మవిశ్వాసంతో సరైన నిర్ణయం తీసుకోండి అన్ని విధాలా శుభం. సన్నిహితుల నుంచి మీ ఆర్థిక పురోగతికి కావాల్సిన సూచనలు అందుతాయి. ఆర్థికంగా కలసి వస్తుంది. ఉద్యోగ వ్యాపారాలలో గౌరవం పెరుగుతుంది. కోర్టు కేసులో తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. ఈ రాశి స్త్రీలు సమాన హక్కు కోసం పురుషులతో పోరాడుతారు.

వృశ్చిక రాశి : మీ పిల్లల అభివృద్ధి మీకు ఎంతో ఆనందదాయకం అవుతుంది. ముఖ్య కార్యాల్లో విజయం సాధిస్తారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. ధనం చేతికి అందక పోవడం వలన ఒక ముఖ్యమైన పని ఆగిపోతుంది. ఉద్యోగంలో తగిన గుర్తింపు లభిస్తుంది ఒక మంచి పని జరుగుతుంది. ఈ రాశి స్త్రీలు నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

మకర రాశి : ఈ కరోనా సమయంలో ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించండి. ధైర్యసాహసాలతో పనిచేయండి. ధన సంపాదనకు నూతన మార్గాలను అన్వేషిస్తారు. నూతన ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం. ఇంతకాలం పడిన శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు ఖర్చులు చేస్తారు. ఈ రాశి స్త్రీలకు సూర్య నమస్కారం వల్ల శక్తి వస్తుంది.

ధనస్సు రాశి : ప్రస్తుత వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు అంత లాభాలను తెచ్చి పెట్టవు. అనుకున్న పనులను తొందరగా పూర్తి చేయండి రేపటి కోసం దాచి ఉంచవద్దు. నలుగురిలో మంచి పేరు వస్తుంది. కుటుంబ విషయాలలో మరియు కుటుంబంలోని వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ రాశి స్త్రీలు తమకు తాము ఉపయోగపడరు కానీ అవతల వారికి ఉపయోగపడతారు.

కుంభరాశి : ఇతరులను మెప్పించడం కోసం అనవసరమైన ఖర్చులు పెట్టకండి. నూతన శక్తి తో పని చేయండి మంచి కాలం మీదే. మిత్రుల సలహాలు పనిచేస్తాయి. ఇంతకు ముందు వాయిదా వేసిన పనులను ఇప్పుడు పూర్తి చేస్తారు. మీ నిర్ణయం కుటుంబ సభ్యులను ఆశ్చర్యపరుస్తుంది. ఈ రాశి స్త్రీలకు మీ సహనం పరిస్థితులను చక్క బడేలా చేస్తుంది.

మీన రాశి : ఉద్యోగంలో శ్రేష్టమైన ఫలితం ఉంటుంది. ఆధ్యాత్మిక మార్గంలో వెళ్లాలంటే ముందు మీ మనసును సరి చేసుకోండి. మనస్సు ఒక్కటే మంచి కానీ చెడు కానీ జరగటానికి కారణం. పనులను వాయిదా వేయకుండా వీలైనంత తొందరగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. ఆదాయ వ్యయాలను సరిగ్గా అంచనా వేయడానికి ప్రయత్నం చేయండి. ఈ రాశి స్త్రీలు ఆస్తుల సమకూర్చుకునే పనిలో నిమగ్నం అవుతారు.

Next Story

Most Viewed