శనివారం పంచాంగం, రాశిఫలాలు (15-05-2021)

by  |
శనివారం పంచాంగం, రాశిఫలాలు (15-05-2021)
X

ప్రదేశము : హైదరాబాద్, ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : వైశాఖమాసం
ఋతువు : వసంత ఋతువు
కాలము : వేసవికాలం
వారము : శనివారం
పక్షం : శుక్లపక్షం
తిథి : తదియ ఈరోజు ఉదయం 7 గం॥ 59 ని॥ వరకు తదుపరి చవితి
నక్షత్రం : మృగశిర
(నిన్న తెల్లవారుజాము 5 గం॥ 46 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 8 గం॥ 38 ని॥ వరకు)
యోగము : ధృతి
కరణం : గరజ
వర్జ్యం : (ఈరోజు సాయంత్రం 5 గం॥ 56 ని॥ నుంచి రాత్రి 7 గం॥ 42 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (నిన్న రాత్రి 10 గం॥ 46 ని॥ నుంచి తెల్లవారు జాము 0 గం॥ 33 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 7 గం॥ 27 ని॥ నుంచి 8 గం॥ 18 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 8 గం॥ 58 ని॥ నుంచి 10 గం॥ 35 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 44 ని॥ నుంచి 7 గం॥ 21 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 49 ని॥ నుంచి సాయంత్రం 3 గం॥ 26 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 44 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 40 ని॥ లకు
సూర్యరాశి : వృషభము
చంద్రరాశి : మిథునము

మేష రాశి : స్నేహితుల వలన ఇబ్బందులు ఉండవచ్చు. కడుపులో నొప్పి మరియు పంటి నొప్పి ఈ రెండింటి వల్ల బాధ ఉండవచ్చు. ఇంతవరకూ బాకీ తీర్చకుండా మళ్లీ అప్పు కోసం మీ దగ్గరికి రావొచ్చు జాగ్రత్త. వ్యాపారంలో కొత్త పెట్టుబడులకు ప్రణాళికలు వేస్తారు. కరోనా వల్ల ఇప్పుడిప్పుడే సర్దుకుంటున్న వ్యాపారం తిరిగి ఇబ్బందుల పాలవుతోంది. ఈ రాశి స్త్రీలకు షేర్ మార్కెట్లో పెట్టుబడులు ఉపయోగం లేదు.

వృషభ రాశి : ఉద్యోగులలో నూతన ఉత్సాహం పనిభారం నుంచి విముక్తి. కరోనా వల్ల అనుకోని వ్యయప్రయాసలు. వ్యాపారంలో ఇబ్బంది సూచిస్తోంది. వాదోపవాదములు కట్టిపెట్టి అవతల వారి గురించి ఆలోచించండి మీకు మనశ్శాంతి. ఊహించని ధనలాభం. ఈ కరోనా సమయంలో ఆప్యాయతలు, అనుబంధాలు, స్నేహాలు, బంధుత్వాలు ఇవన్నీ డబ్బులు ముందు ఎందుకూ కొరగాని కూడా తెలుసుకుంటారు. ఈ రాశి స్త్రీలు కుటుంబంలో ప్రశాంతత లోపించకుండా జాగ్రత్త పడతారు.

మిధున రాశి : ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి. మంచి ఫలితం ఉంటుంది. ఉద్యోగంలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. నేను ఎవరికీ తక్కువ కాను అని నిరూపించుకోవడానికి చాలా శ్రమిస్తారు. ఆఫీస్ వర్క్ మీద మీరు చూపిస్తున్న అతి శ్రద్ధ మీ భార్య లేక భర్త కు ఇబ్బంది కలిగించవచ్చు. అతివేగంతో వాహనము నడప వద్దు. ఈ రాశి స్త్రీలకు పొదుపు చేసిన ధనం తో ఏదైనా స్థలం గానీ ప్లాట్ గాని తీసుకోవాలి అని అనుకుంటారు.

కర్కాటక రాశి : వ్యాపారం కరోనా వల్ల దెబ్బ తినడం మనోవేదనకు కారణమవుతుంది. వివాదాలు తగాదాలు తెగే వరకు రాకుండా జాగ్రత్త వహించండి. మీరు ఎంత మౌనంగా ఉంటే అన్నింటా మీకు మేలు జరుగుతుంది. దైవ కార్యాలు చేపడతారు. ఖర్చులు పెరుగుతాయి అయినా ఇబ్బంది లేదు. పిల్లలతో వారి వ్యవహారాల పట్ల అవసరమైతే కఠినంగా వ్యవహరించండి. ఈ రాశి స్త్రీలకు వ్యాపార పరంగా వచ్చిన ఒక సదావకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు.

సింహరాశి : ఆనందదాయకంగా కాలం ముందుకు సాగుతుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. రాజకీయ వర్గాలకు మరింత అనుకూల సమయం. ప్రతి వ్యవహారము హడావిడి లేకుండా నిదానంగా చేసిన చాలా మంచిది. మీ మొండి వైఖరి వల్ల మీ పిల్లలు ఇబ్బంది పడే అవకాశం. ఈ కరోనా ఈ సమయంలో ఎవరైనా వ్యాపార ప్రసక్తి చేస్తే వద్దని చెప్పండి.

కన్య రాశి : ఈ కరోనా సమయంలో ఇంటా బయట అనేక రకములుగా ఇబ్బందులు. ఉద్యోగ వ్యాపారాలలో జాగ్రత్త వహించాలి. బంధువులతో వివాదాలు సమసిపోతాయి. ఉద్యోగంలో వ్యాపారంలో మీరు పడుతున్న కష్టం గురించి ఏమీ తెలియనట్లు నటించే కుటుంబ సభ్యుల ప్రవర్తన మీకు చాలా బాధ కలిగిస్తుంది. ఈ రాశి స్త్రీలకు పరిశోధనా రంగంలో వారికి కాలం అనుకూలంగా ఉంది.

తులారాశి : భూములు బంగారము మీద పెట్టుబడులు పెట్టవచ్చు వాటి విలువ పెరుగుతుంది. మీ కుటుంబాన్ని మీరు తీర్చిదిద్దుకున్న విధానం వల్ల సంఘంలో మీకు పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. చెడు ఆలోచన మంచిది కాదు ప్రశాంతంగా ఆలోచించండి. ఉద్యోగంలో మీ సత్తా చాటుకుని గుర్తింపు పొందుతారు. బెదిరింపులతో మిమ్మల్ని లొంగ తీసుకుందాం అనుకునేవారు ఫెయిల్ అవుతారు. ఈ రాశి స్త్రీలకు ఎలాగైనా విజయం సాధించాలనే మీ మొండితనం మంచి ఫలితాలనిస్తుంది.

వృశ్చిక రాశి : సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ కరోనా సమయంలో వ్యాపారంలో నష్టం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. శుభకార్యములు కుటుంబసౌఖ్యం. చాలా సందర్భాలలో మీ మనస్సాక్షికి విరుద్ధంగా ప్రవర్తించవలసి వస్తుంది. ఈ రాశి స్త్రీలకు సంతానం తో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు.

ధనస్సు రాశి : ఈ కరోనా సమయంలో ఇల్లు కన్నా బయట ఉండడమే క్షేమంగా అనిపిస్తుంది. మిత్రులు బంధువులతో వివాదాలు పరిష్కరించుకొని వారితో సన్నిహితంగా మెలుగుతారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. సహోదర సహోదరీ వర్గానికి రహస్యంగా ఆర్థిక సాయం చేస్తారు. కుటుంబంలోని చిన్న వారితో ఆనందంగా కలిసి మెలిసి గడుపుతారు. ఈ రాశి స్త్రీలకు కుటుంబంలోని వ్యక్తుల నెగెటివ్ ఆలోచనలు వలన మీ అభివృద్ధికి ఆటంకం.

మకర రాశి : ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంది రుణాలు తీరుతాయి. ఈ కరోనా సమయంలో లేనిపోని భయాల వలన మానసిక అశాంతి. కరోనా యొక్క పరిస్థితిని బట్టి వ్యాపారపరంగా ముందస్తు ప్రణాళికలు వేసుకోండి. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడం వలన మీ విచారం దూరం అయ్యే అవకాశం. ఉన్నంతలో విలాసవంతమైన జీవితం గడపాలని కోరుకుంటారు. ఈ రాశి స్త్రీలకు నిరాశ నిస్పృహలను అదుపులో ఉంచుకోండి దైవ సహాయం లభిస్తుంది.

కుంభరాశి : కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపండి వారి సహాయ సహకారాలతో మీ టెన్షన్ దూరమవుతుంది. పెట్టుబడుల విషయంలో కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయం మీకు శక్తినిస్తుంది. మీడియా రంగంలోని వారికి చాలా అనుకూలం. మీ దూరాలోచన ప్రవర్తన చాలామందికి అర్థం కాదు. ఆ సమర్ధుల తో కలిసి పనిచేయడం విసుగు అనిపిస్తుంది. ఈ రాశి స్త్రీలు మీ ఆత్మగౌరవాన్ని ఆత్మాభిమానాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతో శ్రమిస్తారు.

మీన రాశి : కొత్త వారితో మంచి స్నేహాలు అభివృద్ధి చెందుతాయి. ధనలాభము ఉంది. ఈ కరోనా సమయంలో కూడా వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఒకవైపు మాత్రమే విని నిర్ణయం చెప్పకండి. అందరి వాదనలు విని వాస్తవం గ్రహించండి. ఆఫీసులో మీ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకొని ప్రతి వారితో సానుకూలంగా మెలగండి లేకపోతే మీ ఉద్యోగానికి అపాయం. ఈ రాశి స్త్రీలకు సంతానము లేని వారికి సంతాన ప్రాప్తి.


Next Story

Most Viewed